#టాక్సిక్‌: కేజీఎఫ్ రాఖీభాయ్‌ కంటే ప‌వ‌ర్‌ఫుల్‌?

ఈ సినిమా క‌థాంశం ఏంటో తెలుసుకోవాల‌నే కుతూహాలం ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు, అభిమానుల‌కు ఉంది.

Update: 2024-09-04 19:30 GMT

కేజీఎఫ్ చిత్రంతో ఓవ‌ర్ నైట్ సంచ‌ల‌నంగా మారాడు య‌ష్‌. అత‌డు పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. క‌న్న‌డ రంగం నుంచి 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిన ఏకైక హీరోగా రికార్డుల‌కెక్కాడు. బంగారు గ‌నుల మాఫియాతో పోరాడే గ‌ట్స్ ఉన్న గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించి మెప్పించాడు. య‌ష్ ఇందులో స్టైలిష్ గ్యాంగ్ స్ట‌ర్ గా మెప్పించాడు. కేజీఎఫ్ - కేజీఎఫ్ 2 చిత్రాలు రెండూ క‌లుపుకుని సుమారు 1400 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం.

అయితే కేజీఎఫ్ 2 త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌డానికి య‌ష్ సుదీర్ఘ స‌మ‌యం తీసుకున్నాడు. ఆ త‌ర్వాత `టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్‌` సినిమాని ప్రారంభించాడు. ఇది పీరియాడికల్ డ్రామా. ప్రఖ్యాత దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది 1940ల నేపథ్యంలో సాగే క‌థాంశంతో రూపొందుతోంది. ఇందులో భారీ తారాగణం న‌టిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఇందులో ఉద్వేగం రేకెత్తించే స్త్రీ పాత్రలు య‌ష్ జీవితంలోకి ప్ర‌వేశిస్తాయ‌ని తెలిసింది. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి వైవిధ్యమైన పాత్రలను పోషించడానికి ఎంపికయ్యారు.

ఈ సినిమా క‌థాంశం ఏంటో తెలుసుకోవాల‌నే కుతూహాలం ప‌రిశ్ర‌మ వ్య‌క్తులు, అభిమానుల‌కు ఉంది. తాజాగా అందిన లీక్ ప్ర‌కారం య‌ష్ ఇందులో భీక‌ర‌మైన గ్యాంగ్ స్ట‌ర్ అని తెలిసింది. క‌థాంశంలో చాలా కిక్ ఉంటుంద‌ట‌. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ డ్రగ్ మాఫియా చీకటి కోణాన్ని బ‌హిర్గ‌తం చేస్తుంది. ఈ చిత్రం ఒక‌ ప్రమాదకరమైన ప్రపంచాన్ని పరిశోధించేలా చేస్తుంది. ప్రత్యేకంగా 1940ల నుండి 1970ల వరకు మాఫియా ఏలుబ‌డి ఎలా సాగింద‌న్న‌ది తెర‌పై చూపిస్తున్నారు. యష్ తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని లీక్ అందింది. ఆస‌క్తిక‌రంగా కేజీఎఫ్ చిత్రంలోను అత‌డు గ్యాంగ్ స్ట‌ర్. దానికంటే భిన్నంగా ఎలా క‌నిపిస్తాడు? అంటే... కేజీఎఫ్ రాఖీభాయ్‌ కంటే ప‌వ‌ర్‌ఫుల్ గా క‌నిపిస్తాడ‌ని కూడా లీక్ అందుతోంది.

1000 మందితో భారీ షూట్:

ఆస‌క్తిక‌రంగా యష్ నటించిన `టాక్సిక్` షూటింగ్ బెంగళూరులో 1000 మంది సిబ్బందితో ప్రారంభమైంది. 1940-1970లను ప్రతిబింబించేలా భారీ సెట్ ల‌ను ఇక్క‌డ‌ పునఃసృష్టించారు. మిడ్-డే క‌థ‌నం ప్రకారం.. బెంగళూరు శివార్లలో నిర్మించిన‌ 20 ఎకరాల్లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాకి ఉప‌యోగించే కాస్ట్యూమ్స్ స‌హా ప్ర‌తిదీ ఆస‌క్తిని క‌లిగిస్తాయ‌ని తెలిసింది. నయనతార ఇందులో య‌ష్ కి సోదరిగా క‌నిపిస్తార‌ని కూడా గుస‌గుస‌ల వినిపిస్తున్నాయి. అయితే కియ‌రా అద్వానీ అతడి ప్రియురాలిగా న‌టిస్తుంది. ఇక ప్రొడక్షన్ డిజైన్ బృందం 1940లకి ప్రపంచ ప్రామాణికతను సృష్టించింది. టీమ్ శరవేగంగా పని చేస్తోంది. గీతు మోహ‌న్ వేగంగా ప‌ని చేస్తున్నారు. యష్ నటించిన చాలా కీలకమైన భాగాలను ఇప్ప‌టికే చిత్రీకరించగా, ఆమె కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషీలతో కొన్ని సన్నివేశాలను కూడా రూపొందించార‌ని తెలిసింది.

దర్శకురాలి విజ‌న్ కి త‌గ్గ‌ట్టు పాత్ర‌ల‌కు జీవం పోయడానికి నిర్మాణ బృందం 1000 మంది సభ్యులతో కూడిన సిబ్బందిని ఒక చోటికి తెచ్చార‌ని తెలుస్తోంది. అదనంగా 450 మంది నటీనటులు సెట్లో ఉన్నారు. 300 మంది విదేశీ సహాయ నటులు కీలక సన్నివేశం కోసం తారాగణంలో చేరారు. ఒక సోర్స్ ప్ర‌కారం.. గీతూ ఈ షెడ్యూల్‌లో అడపాదడపా షూటింగ్ (త‌క్కువ చిత్రాలు చేసేవారు) చేస్తున్న 450 మంది నటీనటులను ఎంపిక చేయ‌డం ఒక ఎత్తుగ‌డ‌. కీలకమైన సన్నివేశం కోసం దాదాపు 300 మంది విదేశీ సహాయ నటులను పిలిచారు. షూటింగ్‌లో కొంత భాగం అవుట్‌డోర్‌లో జరుగుతోంది. భారీ వర్షం కారణంగా చిత్రీకరణ చాలాసార్లు నిలిపివేయవలసి వచ్చింది. కానీ తారాగణం, సిబ్బంది పూర్తిగా నిబద్ధతతో ఉన్నారు. చాలాసార్లు రాత్రంతా షూట్ చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్ట్ యష్ స్వంత బ్యానర్, మాన్ స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ - ప్రొడక్షన్ హౌస్ KVN ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 2024లో షూటింగ్ ప్రారంభం కాగా, సెప్టెంబరులో టీమ్ మళ్లీ చిత్రీకరణ ప్రారంభించింది. ఈ చిత్రం 10 ఏప్రిల్ 2025న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News