యాత్ర 2.. నేను విన్నాను.. నేను ఉన్నాను..

మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టి న‌టిస్తుండ‌గా.. జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా యాక్ట్ చేస్తున్నారు.

Update: 2024-02-03 08:47 GMT

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కుమారుడు ఏపీ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర 2. మహి వి రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డి పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టి న‌టిస్తుండ‌గా.. జగన్మోహన్ రెడ్డి పాత్ర‌లో కోలీవుడ్ యాక్ట‌ర్ జీవా యాక్ట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ తో పాటు సాంగ్స్ విడుద‌ల అవ్వగా.. మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్.. ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఇచ్చిన మాట కోసం యుద్ధానికైనా సిద్ధం అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫిబ్రవరి 8వ తేదీన సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"పుట్టుకతోనే చెవుడు ఉంది. అందువల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్‌ పెడితే వినబడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పారు. అన్నా మాకు అంత స్థోమత లేదు" అంటూ ఓ మహిళ తన కుమార్తె గురించి సీఎం వైఎస్ (మమ్ముట్టి)కి చెప్పే సీన్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత వైఎస్ మరణం, ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జ‌గ‌న్ బ‌య‌ట‌కు రావడం, కొత్త పార్టీ పెట్ట‌డం, జ‌గ‌న్ జైలుకు వెళ్ల‌డం, జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అనంత‌రం ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌ లో జరిగిన ఘటనలు.. మేకర్స్ ఇవన్నీచూపించారు. చివరలో నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ జీవా చెప్పే హైలైట్ డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది.

యాత్ర 2 సినిమాలో జగన్ సతీమణి వైఎస్ భారతిగా కేతికా నారాయణ్ నటించారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక యాత్ర 2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాత్ర విడుదలైన ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. భారతిగా కేతికా నారాయణన్, సోనియాగా సుజానే పర్ఫెక్ట్ యాప్ట్ అంటూ నెటిజన్లు చెబుతున్నారు. జగన్ పాత్రలో జీవా సైతం ఒదిగిపోయారని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

Full View

Tags:    

Similar News