యెదకి ఒక గాయం.. ఖుషిలో ఎమోషనల్ టచ్
ఈ సినిమా నుంచి లవ్ పెయిన్ తెలిపే 'యెదకి ఒక గాయం..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాతో ఈసారి చాలా క్లాస్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ నిర్వాన దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్‌తో పాటలు కూడా ఎంతగానో అట్రాక్ట్ చేశాయి.
ఖుషి సినిమా నుంచి ఫస్ట్ విడుదలైన నా రోజా నువ్వే ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తర్వాత వచ్చిన ఆరాధ్య కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక ఖుషి టైటిల్ సాంగ్ కూడా పరవాలేదు అనిపించింది. అయితే ఇప్పుడు సినిమాలో నుంచి ఊహించిన విధంగా ఒక ఎమోషనల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి లవ్ పెయిన్ తెలిపే 'యెదకి ఒక గాయం..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. యెదకి ఒక గాయం..వదలమంది ప్రాణం ..చెలిమివిడి బంధం..ఎవరు ఇక సొంతం..కలతపడి హృదయం... కరగమంది మౌనం...గతమువిడి పాశం..ఏది ఇక బంధం అంటూ లవ్ ఫీల్ తో సాగుతున్న ఈ పాట క్యారెక్టర్స్ మధ్య బాండింగ్ ను లోతుగా హైలెట్ చేస్తోంది. ఈ పాటకు కూడా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ సాహిత్యాన్ని అందించారు. ఇక సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ స్వరపర్చి ఆయనే పాడారు.
సాంగ్ లో సాహిత్యం, సంగీతం ఎంతో అందంగా కలిసిపోయిన ఈ పాట వినగానే మ్యూజిక్ లవర్స్ ఫిదా అవుతున్నారు. విజయ్ దేవరకొండ చూపించిన ఎమోషన్స్ కూడా ఆడియెన్స్ కు హార్ట్ టచింగ్ గా ఉండబోతున్నట్లు అర్ధమవుతోంది. ఈ పాట సినిమాకి చాలా ముఖ్యం అని తెలుస్తోంది వచ్చే. అలాగే పాటకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పిక్చరైజ్ చేసినట్లు దర్శకుడు చెబుతున్నారు.
ఇక సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ మరోసారి అన్ని భాషల్లో కూడా ప్రమోషన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల మ్యూజిక్ ఈవెంట్ కు కూడా మంచి క్రేజ్ వచ్చింది. సమంత కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.