ఆ యువ హీరో బండి కష్టంగానే నడుస్తోందే!
అయితే వాటిలో సక్సెస్ అనేది ఒకటి..రెండు చిత్రాలు మినహా మిగతా వేవి ఆ యంగ్ హీరోకి కలిసి రాలేదు. చివరికి బాలీవుడ్ లో కూడా ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు.
టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చిన ఆ యువ కెరటం వస్తూనే తానంటే నిరూపించుకున్నాడు. హీరో మెటీరియల్...హైట్..వెయిట్ కొలతలన్నీ పక్కాగా ఉన్నాయి. ఏకంగా ఏడెనిమిది- సినిమాలు చేసేసాడు. అయితే వాటిలో సక్సెస్ అనేది ఒకటి..రెండు చిత్రాలు మినహా మిగతా వేవి ఆ యంగ్ హీరోకి కలిసి రాలేదు. చివరికి బాలీవుడ్ లో కూడా ఇటీవలే ఎంట్రీ ఇచ్చాడు. అక్కడైనా రాణంచాలి! అన్న ఆశతో ప్రవేశించినా ఫలితం మాత్రం మరోసారి నిరాశనే మిగిల్చింది.
అయితే ఇన్ని సినిమాలు చేయడం వెనుక తండ్రి కూడా కీలక పాత్ర పోషించాడు. ఆ యువ హీరో తండ్రి నిర్మాత కావడంతో అవకాశాల పరంగా జయాజయాలతో సంబంధం లేకుండా ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. నటుడిగా నిరూపించుకున్నాడు. కానీ స్టోరీ వైఫల్యాలే అతన్నిరేసులో వెనక్కి నెట్టుతున్నాయి. తనకన్నా వెనకొచ్చిన వారు ముందు వరుసలో ఉన్నా! ఆ యంగ్ హీరో మాత్రం అంతకంతకు రేసులో వెనుకబడుతన్నట్లే కనిపిస్తోంది.
ఆ హీరో నుంచి స్ట్రెయిట్ సినిమా వచ్చి చాలా కాలమవుతుంది. చివరిగా రీమేక్ తో మెప్పించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. స్టోరీలు వింటున్నట్లు కూడా ప్రచారంలోకి రాలేదు. ఆ మధ్య వాస్తవ సంఘటనలు ఆధారంగా ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ మళ్లీ ఆ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ లేదు. ఆ సినిమా ఉందా? క్యాన్సిల్ అయిందా? అన్నది కూడా క్లారిటీ లేదు.
ప్రస్తుతానికి హీరో ఖాతాలో సినిమాలేవి లేనట్లే కనిపిస్తోంది. ఏదిఏమైనా ఇది వెనుకబాటు తనమే. ఆరంభం లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నటుడు ఇప్పుడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాడు. ఈ గ్యాప్ ఉన్న మార్కెట్ పైనా..ఇమేజ్ పైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ ప్రచారాన్ని షేక్ చేసేలా సంచలన అప్ డేట్ తో ఎప్పుడు వస్తాడో చూడాలి. అలాగే ఆ కుటుంబం నుంచి మరో నటుడు కూడా తెరంగేట్రం చేసాడు. నటన పరంగా అతను పాస్ ఆయ్యాడు. కానీ ఇంతవరకూ ఆ నటుడు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. మరి అన్నదమ్ములిద్దరు ఎలాంటి అప్ డేట్ ఇస్తారో చూడాలి.