ముంబై నుంచి సామాన్లు సర్ధేసిన యువహీరో?
చివరికి సదరు యువహీరో కలలు కల్లలు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ ఇంటి నుంచి సామాన్లు సర్ధుకుని హైదరాబాద్ కి వచ్చేస్తున్నాడని తెలిసింది.
రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకునే వారు ఉన్నారు. అదే రాత్రిలో నిండా మునకలు వేసేవారు ఉన్నారు. అయితే టాలీవుడ్ కి చెందిన ఒక యువహీరో బాలీవుడ్ కలలతో ఎంతో గ్రాండ్ గా హిందీ చిత్రసీమలో అడుగుపెట్టాడు.
అయితే తాను అనుకున్నది ఒకటి.. అయింది ఇంకొకటి. అక్కడ ఆశించినది తనకు దక్కలేదు. నటించిన తొలి సినిమానే డిజాస్టర్ అవ్వడంతో ఏం చేయాలో తోచలేదు. అయితే బింకానికి పోయి అతడు ఇన్నాళ్లుగా ముంబైలో తన ఇంటికి అద్దె కడుతూనే ఉన్నాడు. ఎలాగైనా హిందీ చిత్రసీమలో పాగా వేయాలని భావించి ఒక ఖరీదైన ఏరియాలోని ఇంటికి అద్దె చెల్లింపులు చేస్తున్నాడు. చివరికి సదరు యువహీరో కలలు కల్లలు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ ఇంటి నుంచి సామాన్లు సర్ధుకుని హైదరాబాద్ కి వచ్చేస్తున్నాడని తెలిసింది.
రెండేళ్ల పాటు హిందీ బెల్ట్ లో వెయిట్ చేసాడు. కానీ ఆశించినదేదీ జరగలేదు. అతడు నటించిన మొదటి హిందీ చిత్రం బిగ్ ఫ్లాప్ అవ్వడం తీవ్రంగా నిరాశపరిచింది. యూట్యూబ్‌లో అతడి హిందీ-డబ్బింగ్ సినిమాల జనాదరణ కారణంగా ఉత్తర భారతదేశంలో భారీ ఫాలోయింగ్ ఉందని అతడు భ్రమపడ్డాడు. అయితే అతడు నటించిన తొలి హిందీ చిత్రం ఘోర పరాజయం పాలవ్వడం సందేహాలను లేవనెత్తింది. ఈ వైఫల్యం యూట్యూబ్ వీక్షణలు హిందీ పరిశ్రమలో స్టార్ డమ్ ని అందించవని ప్రూవైంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే దానికి ఇలాంటి గిమ్మిక్కులు సరిపోవని ప్రూవైంది. టాలీవుడ్ కి చెందిన పలువురు అగ్ర హీరోలకు కూడా ఇటీవల గుణపాఠం అయింది. అందరు హీరోలు పాన్ ఇండియాలో వెలిగిపోవడం కుదరని పని అని కూడా ప్రూవ్ అయింది. అందుకే ఇప్పుడు తిరిగి తెలుగు పరిశ్రమలో కెరీర్ కోసం అతడు వెతుకుతున్నట్టు తెలిసింది.