రిస్క్ లో యువ హీరోలు.. కంటెంటే కాపాడాలి!
రకరకాల కథలను దర్శకులను మారుస్తున్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రావడం లేదు
ఈవారం మరికొన్ని విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే అందులో ముఖ్యంగా గాండీవదారి అర్జున, బెదురులంక 2012 సినిమాలపై కాస్త ఫోకస్ ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. రెండు సినిమాలు కూడా దేనికవే ప్రత్యేకం. అయితే ఈ రెండు సినిమాలు కూడా కథానాయకులకు చాలా ముఖ్యమైన చిత్రమని చెప్పవచ్చు.
ఎందుకంటే వీరు ఇంతకుముందు చేసిన సినిమాలు కొన్ని వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా యువ హీరో కార్తీక్ గుమ్మికొండ సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతను మొదటి నుంచి కూడా డిఫరెంట్ స్టైల్లో ప్రేక్షకులకు ఆకట్టుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. కేవలం ఆర్ఎక్స్ 100 సినిమా తప్పితే ఇప్పటివరకు మరో సినిమా అతనికి మంచి ఫలితాన్ని ఇవ్వలేదు.
రకరకాల కథలను దర్శకులను మారుస్తున్నప్పటికీ కూడా అదృష్టం కలిసి రావడం లేదు. ఇక ఈసారి బెదురులంక సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కానీ ఈ సినిమాపై అనుకున్నంత స్థాయిలో అయితే అంచనాలు లేవు. యుగాంతం అబద్దం చుట్టూ తిరిగే కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటివరకు ట్రైలర్ సాంగ్స్ కూడా అంతగా క్లిక్ ఏమీ కాలేదు. కేవలం సినిమా విడుదల తర్వాత కంటెంట్ తో మాత్రమే నడిపించాల్సిన అవసరం ఉంది.
ఇక మరో వైపు మెగా హీరో వరుణ్ తేజ్ యాక్షన్ మూవీ గాండీవదారి అర్జున తో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఎప్పుడెప్పుడో కమర్షియల్ గా ఎఫ్2 సినిమాతో వరుణ్ తేజ్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత గడ్డలకొండ గణేష్ పర్వాలేదు అనిపించగ అనంతరం 'గని' సినిమా అయితే డిజాస్టర్ అయింది. అది కూడా అంతగా ఏమీ క్లిక్ కాలేదు.
ఇక ఇప్పుడు గాండీవదారి అర్జున సినిమాతో అతను ఫ్లాప్స్ కు బ్రేక్ వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ సినిమాకు హాలీవుడ్ స్టైల్ కలరింగ్ హైలెట్ చేస్తున్నారు.. కానీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించేంత కంటెంట్ మాత్రం హైలెట్ కావడం లేదు. ఆడియన్స్ లో కూడా పెద్దగా అంచనాలు ఏమీ లేవు. ఈ సినిమా కూడా థియేటర్లోకి వచ్చిన తర్వాతనే కంటెంట్ క్లిక్ అయితేనే జనాలు చూసే అవకాశం ఉంటుంది. మరి రెండు సినిమాలను ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.