ఇద్దరి పెళ్లాలతో ఎలా ఉండాలో చెప్పిన!
బిగ్ బాస్ షో అన్ని భాషల్లోనూ దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. షోపై రకరకాల విమర్శలొచ్చినా చూసే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గలేదు
బిగ్ బాస్ షో అన్ని భాషల్లోనూ దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. షోపై రకరకాల విమర్శలొచ్చినా చూసే వాళ్ల సంఖ్య మాత్రం తగ్గలేదు. బిగ్ బాస్ ఓటీటీలోనూ మంచి సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. తాజాగా హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ -3 ప్రారంభమైంది. ఇందులో ఫేమస్ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్ తన ఇద్దరు భార్యలతో పాల్గొనడం హైలైట్. ఇలా ఇద్దరి భార్యలతో కంటెంస్టెంట్ గా రావడం అన్నది బిగ్ బాస్ చరిత్రలోనే మొట్ట మొదటి సారి.
ఇలా ఇద్దరి భార్యలతో రావడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇద్దరి భార్యలతో ఇలా వచ్చి సమాజానికి ఏం చెప్పబోతున్నారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆర్మాన్ మాలిక్ సమర్ధించుకున్నాడు. తమ మద్య ఎలాంటి వివాదాలు రావని, ఒక ఫ్యామిలీగా కలిసి ఉలా ఉంటామో చూపించడానికే వచ్చాం అన్నాడు.
అలాగే తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? ఇద్దరి భార్యలతో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది? తెలియజేసేందుకు ఈ షో ఎంతో ఉపయోగపడుతుందని, తన లాంటి వాళ్లకు నాలాంటి వాళ్లు ధైర్యం నింపుతారని నవ్వేసాడు. తన ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకుని గెలుపు గుర్రం ఎక్కుతానని ధీమా వ్యక్తం చేసాడు. మరి ఇద్దరి భార్యలతో ఆర్మాన్ ఆట ఎలా ఉంటుందో లైవ్ లో చూస్తే గానీ తెలియదు.
ఈ ముగ్గురిది ప్రేమ వివాహం. తొలుత ఆర్మాన్-పాయల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాయల్ బ్యాంక్ ఉద్యోగి కాగా ఆమెని లవ్ లో పడేసి పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత క్రితికా మాలిక్ తో నూ ఆర్మాన్ ప్రేమలో పడ్డాడు. క్రితాకి పాయల్ కి మంచి స్నేహితురాలు. పాయల్ ద్వారానే ఆర్మాన్ కి పరిచయమైంది. పెళ్లి కి ముందు తర్వాత కొన్నాళ్ల పాటు గొడవలు పడ్డారు. ఆ తర్వాత అంతా సెట్ అయింది. ఆర్మాన్ ఇద్దరి భార్యలకు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నాళ్ల పాటు హైదరాబాద్ లోనే కాపురం ఉన్నాడు. ప్రస్తుతం పంజాబ్ లో ఉంటున్నాడు.