బెల్లకొండ శ్రీనివాస్.. మళ్ళీ స్పీడ్ పెంచాడు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చివరిగా అల్లుడు అదుర్స్ సినిమాతో తెలుగులో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Update: 2024-08-17 07:02 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చివరిగా అల్లుడు అదుర్స్ సినిమాతో తెలుగులో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే తన సినిమాల హిందీ వెర్షన్స్ కి మంచి ఆదరణ వస్తూ ఉండటంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు.

హిందీలో బడా నిర్మాత సంస్థలో ఛత్రపతి రీమేక్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దాంతో మరల బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగుపైన పూర్తిగా ఫోకస్ పెట్టారు. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ప్రస్తుతం సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే కౌశిక్ దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ చేస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే లాంచ్ అయ్యింది. షూటింగ్ కూడా మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ చిత్రానికి పేరు పెట్టలేదు. ఈ రెండు లైన్ లో ఉండగానే బెల్లంకొండ శ్రీనివాస్ మరో కొత్త సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఈ మూవీ లాంచింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆగష్టు 19న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతోందని తెలుస్తోంది.

నాంది, ఉగ్రం ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటుగా మంచు మనోజ్, నారా రోహిత్ కూడా హీరోలుగా నటిస్తున్నారంట. తమిళ్ హిట్ మూవీ గరుడన్ కి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంట.

అయితే టైసన్ నాయుడు మూవీ షూటింగ్ 70 శాతం కంప్లీట్ అయ్యిందంట. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్న సాధ్యం అవుతుందా లేదా అనేదానిపై క్లారిటీ లేదు. టైసన్ నాయుడు ఈ ఏడాది రిలీజ్ కాకుంటే 2025 ఆరంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే మిగిలిన రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఈ సినిమాలతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి కమర్షియల్ హీరోగా బలంగా నిలబడాలని అనుకుంటున్నాడు. ఛత్రపతి సినిమాతో పోగొట్టుకున్న ఇమేజ్ ని పాన్ ఇండియా హీరోగా సాధించాలని భావిస్తున్నాడు. అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News