నిప్పు, రేయ్ దెబ్బల తరువాత.. 8 ఏళ్ళకు డైరెక్షన్
ఆయన.. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
లైఫ్‌లో, కెరీర్లో గ్యాప్‌లు మనం తీసుకోం.. అవే వస్తుంటాయి. ప్రతి వ్యక్తి లైఫ్‌లోనూ కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటి వల్లే ఏదో ఒక సమయంలో కొన్ని సార్లు గ్యాప్‌లు ఆటోమెటిక్‌గా వస్తుంటాయి. దర్శకుడు వైవీఎస్ చౌదరి విషయంలోనూ ఇదే జరిగింది. నిర్మాతగా, దర్శకుడిగా గట్టిగా దెబ్బతిన్న ఆయన.. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టి ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.
వైవీఎస్ చౌదరి గురించి దాదాపుగా చాలా మంది సినీ ప్రియులకు తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మీద విపరీతమైన అభిమానంతో సినిమాల్లోకి వచ్చిన ఈయన.. ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చేశారు. ఎన్నో హిట్ మూవీస్ ప్రేక్షకులకు అందించారు. 'సీతారామరాజు', 'యువరాజు', 'సీతయ్య', 'దేవదాస్' వంటి సక్సెస్ ఫుల్ మూవీస్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇండస్ట్రీలో కొత్త వారితో సినిమా చేసే దర్శకుడుల్లో తేజ తర్వాతే ఈయన పేరే వినిపిస్తుంది. కొత్త టాలెంట్‌తో సినిమాలు చేసి బిగ్ హిట్స్ అందుకున్నారు. ఆయన తొలి సినిమా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి .. కొత్త వారితో తీసిన సినిమానే. అందులో ఏఎన్నార్ తప్ప మిగతా ప్రధాన తారాగణం అంతా నూతన నటీనటులే కావడం విశేషం. వెంకట్, చాందినీ, శివాజీ ఇలా చాలా మంది ఈ సినిమాతోనే ఇంట్రడ్యూస్ అయ్యారు.
అయితే 2006లో దేవదాస్ తర్వాత ఆయనకు సరైన విజయం దక్కలేదు. ఒక్కమగాడు, సలీమ్ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత 2012లో నిర్మాతగా నిప్పు సినిమాతో దారుణంగా దెబ్బతిన్నారు. 2015లో రేయ్ కూడా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.
అయితే ఇప్పుడు మరోసారి చాలా ఏళ్ల తర్వాత కొత్త తరహ సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. కొత్త వారితో సినిమా చేయనున్నారు. అయితే సాంకేతికంగా మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నిషియన్స్‌తో పని చేయబోతున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమా సంగీతం అందించనున్నారు.
వైవీఎస్ చౌదరి-కీరవాణి కాంబోలో వచ్చినశ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య సినిమాలు మ్యూజికల్‌గా మంచి హిట్స్ అందుకున్నాయి.ఇప్పుడు చేయబోయే కొత్త సినిమాలో కూడా మ్యూజిక్కు ప్రాధాన్యత ఉంటుంద. త్వరలోనే ఈ సినిమాకు సంబధించి అధికారిక ప్రకటన రానుంది.