యానిమ‌ల్ `జోయా` పాత్ర‌తో జియాకు పోలిక‌!

యానిమల్‌లో రణబీర్ జీవితంలో రెండో యువ‌తిగా నటించిన ట్రిప్తీ పాత్ర లాగా త‌న పాత్ర‌ ఉంటుంద‌ని నికితా అన్నారు.

Update: 2024-02-11 03:27 GMT

షాహిద్ కపూర్ నటించిన `కబీర్ సింగ్` చిత్రంలో జియా శర్మ పాత్రతో ఖ్యాతి గడించిన నికితా దత్తా. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్‌లోని జోయా గా న‌టించిన‌ త్రిప్తి డిమ్రీ పాత్రకు, క‌బీర్ సింగ్ లో త‌న పాత్ర‌కు మధ్య పోలికలు ఉన్నాయని నికితా తాజా ఇంట‌ర్వ్యూలో అంది. కబీర్ సింగ్‌లో నికితా.. షాహిద్ జీవితంలోకి ప్ర‌వేశించే ప‌రాయి మహిళగా నటించింది. యానిమల్‌లో రణబీర్ జీవితంలో రెండో యువ‌తిగా నటించిన ట్రిప్తీ పాత్ర లాగా త‌న పాత్ర‌ ఉంటుంద‌ని నికితా అన్నారు.


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. చిత్రంలోని ప్రతి పాత్ర, రణబీర్ కపూర్ సెకండ్ ల‌వ్ ఇంట్రెస్ట్ ట్రిప్తీ డిమ్రీ వరకు ప్ర‌తి ఒక్క‌రి న‌ట‌న‌కు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు షాహిద్ కపూర్ నటించిన కబీర్ సింగ్‌లో జియా శర్మ పాత్రతో ఖ్యాతి గడించిన నికితా దత్తా ట్రిప్తీతో త‌న పోలిక‌ల‌ను చెబుతోంది.

``ప్రజలు ఈ చిత్రాలను గొప్ప‌గా ఆద‌రించారు. ఇలాంటి పాత్ర‌లను ప్రతి ఒక్కరూ పొందలేరు. కబీర్ సింగ్‌లో నేను పోషించిన పాత్ర నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇక్కడ ట్రిప్తీ పాత్ర కూడా అలాంటి పాత్ర‌నే`` అని నికిత తాజా ఇంట‌ర్వ్యూలో అన్నారు. యానిమల్‌లో ట్రిప్తీ ఘాటైన రొమాన్స్ కు యువ‌త‌రంలో మంచి గుర్తింపు ద‌క్కింది. ఈ సినిమా చూసినప్పుడు, జోయా పాత్ర చాలా ప్రత్యేకంగా నిలిచిందని నికితా భావించింది. ఆ పాత్రలో ట్రిప్తీ చాలా అద్భుతంగా ఉంది. మా ఇద్ద‌రి పాత్రలను చాలా చిన్న‌పాటి తేడాతో రాసార‌ని అర్థం చేసుకోవడానికి ఈ రెండు చిత్రాలను మ‌ళ్లీ చూడాలి అని అంది.

కబీర్ సింగ్ విజయం తను ఎలాంటి సినిమాలు చేయాలో నేర్పింద‌ని నికితా అన్నారు. కబీర్ సింగ్‌కి ఓకే చెప్పినందుకు ఇత‌ర‌ తారలకు కృతజ్ఞతలు తెలిపింది. తాను మరేదైనా క్యారెక్టర్‌లో నటిస్తానని భావించినందున నాటి విజయాన్ని తాను ఊహించలేదని ఆమె అంగీకరించింది. అయితే సినిమా చూసి బయటకు వచ్చేసరికి మేకర్స్‌కి, త‌న‌కు చాలా ఆశ్చర్యం కలిగించిందని వెల్ల‌డించింది. సందీప్‌తో మళ్లీ కలిసి పని చేయడం గురించి అడిగినప్పుడు నాకు స‌రిప‌డే పాత్ర ఉన్న‌ప్పుడు సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు.

లేటెస్ట్ ఫోటోషూట్ వైర‌ల్

ఇంత‌లోనే నిఖిత ద‌త్తా తాజా ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ప్ర‌ఖ్యాత ఉమెన్స్ ఫిట్ నెస్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై త‌ళుక్కుమ‌న్న నిఖితా హాటెస్ట్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది ఫిబ్రవరి అంతా గ్లామ్ & లవ్ గురించి! అన్న క్యాప్ష‌న్ తో ఈ ఫోటోను సోష‌ల్ మీడియాల్లో నిఖితా షేర్ చేసింది.

ఈ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను నికితా షేర్ చేసింది. నా ప్రయాణం వైవిధ్యభరితమైన అనుభవాల సమ్మేళనం.. పోటీ ప్ర‌పంచంలో కెమెరా ముందు ఉండటం, హోస్టింగ్ చేయడం.. TV లేదా OTT ప్లాట్‌ఫారమ్‌లలో నటించడం.. సంవత్సరాలుగా నేను ప్రతి అనుభవంలో పాఠాలను కనుగొనగలిగినంత వరకు అన్వేషించాను.. అని తెలిపింది. నికితా తాజా ఇంట‌ర్వ్యూలో స్వీయ ప్రేమ సారాంశం, బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి, యోగాపై ప్రేమ ఫిట్‌నెస్ 2024 లక్ష్యాల గురించి మాట్లాడింది. మహిళల ఫిట్‌నెస్ మ్యాగ్ ఇప్పుడు Magzter.comలో అందుబాటులో ఉంది.



Tags:    

Similar News