అంబానీల పెళ్లి విందు... అదరగొట్టనున్న స్పెషల్స్ ఇవే!!
ఈ నేపథ్యంలో... జూలై 12న ఇచ్చే పెళ్లి విందుకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు తెరపైకి వస్తున్నాయి.
ఆసియాలోనే అపర కుభేరుడు ముకేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్, వివాహం, విందులు, అందులోని వంటలు, అతిథులు, ప్రత్యేక కార్యక్రమాలు, వస్త్రాలు, వివాహ పత్రిక, వేదిక, పార్టీ... ఇలా పలు విషయాలు సుమారు ఈ ఏడాది మార్చి నెల నుంచి నిత్యం మీడియాలో నానుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరగనున్న విందు భోజనాల విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అవును... ముకేష్ అంబానీ ఇంట వివాహానికి సంబంధించిన విషయాలు గత నాలుగైదు నెలలుగా హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకల్లో ప్రతీదీ అత్యద్భుతంగా ఉందని చెప్పడం నుంచి, వాటిని సిద్ధం చేసే విషయం కూడా ఆసక్తిగా ఉంటుంది. ఈ సమయంలో ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల వివాహం జూలై 12 న మొదలై మూడు రోజులు జరగనుంది.
వాస్తవానికి వీరి నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వరకూ జరిగిన వేడుకలకు సంబంధించిన ప్రతీ కార్యక్రమం కనీవినీ ఎరుగని రీతిలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో... జూలై 12న ఇచ్చే పెళ్లి విందుకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు తెరపైకి వస్తున్నాయి. అయితే పూర్తి మెనూ గురించిన వివరాలు ఇంకా బయటకు రాకపోయినా.. అందులో కొన్నింటి వివరాలు మాత్రం బయటకు వచ్చాయి.
ఇందులో భాగంగా వివాహ విందు మెనూలో కుల్ఫీ, ,టిక్కీ, ఫాలుదా, పాలక్ ఛాట్, టమాటా ఛాట్, ,దహీ పూరి, చనా కచోరీ, బనారస్ ఛాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం సిద్ధం చేయనున్నారని అంటున్నారు. వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ ఛాట్ భండార్ వ్యాపారులు ఈ వివాహ విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని కాశీ ఛాట్ భండార్ యజమాని కేసరి తెలిపారు!
కాగా ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... జూలై 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ జరగనున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో అతిథులకు సుమారు 2,500 రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టిన సంగతి తెలిసిందే.