సమయానికి భోంచేస్తే ..చావుని జయించినట్లే !

సరిగ్గా ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం, తిరిగి రాత్రి 8 గంటలకు భోజనం ముగించిన వారికి గుండె, రక్తనాళాలకు మేలు జరుగుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడయింది.

Update: 2024-05-28 00:30 GMT

ఉరుకులు, పరుగుల జీవితంలో పడి ఎప్పుడు తింటున్నామో ? ఎప్పుడు పడుకుంటున్నామో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. డబ్బులు వెనకేసే ప్రయత్నంలో పడి కొందరు సమయానికి ఆహారం మీద ధ్యాసపెట్టడం లేదు. మరి కొందరు అవకాశం కలిసిరాక తిండి గురించి పట్టించుకోవడం లేదు. వేళ కాని వేళలలో తిని అనారోగ్యాన్ని ఆహ్వానించి ఆస్పత్రుల పాలవుతున్నారు.

సరిగ్గా ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం, తిరిగి రాత్రి 8 గంటలకు భోజనం ముగించిన వారికి గుండె, రక్తనాళాలకు మేలు జరుగుతున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడయింది. రోజులో తొలి భోజనం ఆలస్యమవుతున్నకొద్దీ ప్రతి గంటకూ 6% చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఉదయం 8 గంటలకు టిఫిన్ చేసేవారితో పోలిస్తే ఉదయం 9 గంటలకు టిఫిన్‌ తినేవారికి 6% ఎక్కువగా గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక రాత్రి 8 గంటలకు ముందే చివరి భోజనం చేసేవారితో పోలిస్తే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారికి గుండెజబ్బు ముప్పు 28% ఎక్కువగా ఉంటుందని తేలింది.

ఆహార అవసరాలు వేరువేరుగా ఉన్నప్పటికీ వేళకు తినటం, భోజనానికీ భోజనానికీ మధ్య తగినంత విరామం ఉండేలా చూసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు ఎక్కువగా తినకపోవటం ఉత్తమమని, రాత్రి భోజనం తొందరగా ముగిస్తే తగినంత సేపు ఉపవాసం ఉన్నట్టు అవుతుందని చెబుతున్నారు.. దీనివల్ల రక్తపోటు, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు. రాత్రిపూట తిన్న తర్వాత కాసేపు నడవడం మూలంగా మంచి నిద్రతో పాటు శరీరం ఉల్లాసవంతంగా ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News