మనం ఇష్టంగా తినే సమోసాకూ ఓ రోజుంది.. ఓ కథ ఉంది

సమోసా కూడా అంతటా ఒకటే టేస్టీ కాకుండా.. ఎన్నో వెరైటీలు లభిస్తుంటాయి.

Update: 2024-09-06 11:30 GMT

సమోసా అంటే ఇష్టపడని వారు ఉండరేమో. కాలం ఏదైనా.. సమయం ఎప్పుడైనా.. తినాలనిపించేది సమోసా. బేకరికి వెళ్లామంటే ముందుగా ఇచ్చే ఆర్డర్ సమోసా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సమోసా చూస్తేనే నోట్లో లాలాజనం వస్తుంటుంది. ఇక వర్షాకాలం సీజన్‌లో అయితే దానికి డిమాండ్ మామూలుగా ఉండదు. గరంగరంగా లాగనించేందుకు సమోస ప్రియులు ఆరాటపడుతుంటారు. అయితే.. అందరికి అంతలా ఇష్టమైన సమోసాకూ ఓ రోజు ఉందంటే నమ్ముతారా..?

సమోసా కూడా అంతటా ఒకటే టేస్టీ కాకుండా.. ఎన్నో వెరైటీలు లభిస్తుంటాయి. ఇక పొరుగు దేశాల్లోనూ సమోసాలకు ఉన్న క్రేజీ మామూలుది కాదు. అయితే.. మన దేశంలో ఎంతో ఇష్టంగా ఆరగించే సమోసా మన దేశంలో పుట్టింది కాదు. అవును.. సమోసా పశ్చిమాసియా నుంచి మన దేశానికి వచ్చిందట. అలాగే.. సమోసాకు ఆ పేరు పర్షియన్ అనే పదం నుంచి వచ్చిందంట.

10వ శాతాబ్దికి ముందే పశ్చిమాసియాలో సమోసాల ట్రెండ్ నడిచింది. 13 లేదా 14వ శతాబ్దలంలో మన దేశానికి వచ్చింది. అక్కడి నుంచి పలువురు వ్యాపారులు ఇక్కడికి వచ్చారు. వారే మన దేశానికి సమోసాలను పరిచయం చేశారు. దాంతో అప్పటి నుంచి మన దేశంలో సమోసా ఫేమస్ అయిపోయింది. తరువాత తరువాత ప్రపంచ వ్యాప్తంగా సమోసాలకు డిమాండ్ ఏర్పడింది.

అయితే.. ఈ సమోసాల్లోనూ పలు రకాల వెరైటీస్ ఉన్నాయి. మొదట్లో సమోసాలో ఉల్లి, చికెన్, మొక్కజొన్న గింజలతో తయారు చేసేవారు. రానురాను ఇప్పుడు బిర్యానీ, చాక్లెట్, చీజ్, పుట్టగొడుగులు, డ్రైఫ్రూట్స్, పాలక్ పన్నీరు, గులాబ్ జామున్.. ఇలా విభిన్న రుచుల్లో సమోసాలను తయారు చేస్తున్నారు. 2017 సంవత్సరంలో లండన్‌లో 153 కిలోల అతిపెద్ద సమోసా తయారుచేసి అక్కడి వ్యాపారి రికార్డు సృష్టించారు. పాకిస్తాన్‌లో మాత్రం పెద్ద సైజులో వీటిని తయారు చేసి విక్రయింస్తుండడం విశేషం.

Tags:    

Similar News