టమాటా కేజీ రూ.300 ఖాయమట.. ఎందుకంటే?
ఈ నేపథ్యంలో టమాటా ధరలు మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు.
చూస్తుండగానే కేజీ టమాటా సెంచరీ దాటేసి.. వడి వడిగా డబుల్ సెంచరీ కొట్టేయటం తెలిసిందే. అంతకంతకూ పెరుగుతున్న టమాటా ధర ఎక్కడి వరకు వెళుతుంది? ఎప్పటిలానే ధర తగ్గే పరిస్థితులు లేవా? ఈ ధర మంట ఎంతవరకు వెళ్లనుంది? లాంటి క్వశ్చన్లు చాలామందికి కలుగుతున్నాయి.
వీటికి సమాధానం వెతికితే.. షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు డబుల్ సెంచరీ టచ్ చేసిన టమాటా ధర రానున్న రోజుల్లో ట్రిఫుల్ సెంచరీని దాటేయటం ఖాయమని చెబుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా షెడ్యూల్ ప్రకారం రావాల్సిన టమాటాలు మార్కెట్ లోకి వచ్చే అవకాశం లేదని.. ఈ నేపథ్యంలో టమాటా ధరలు మరింత పెరగటం ఖాయమని చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బ తిందని.. ఈ కారణంగా ధరలు మరింత పెరిగే వీలుందంటున్నారు. టమాటాతో పాటు క్యాప్సికం ధరలు కూడా పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా టమాటా పంట ప్రభావితమైంది. ఈ ధరల మంటతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జులై 14 నుంచి ఢిల్లీలో కేంద్రం సబ్సిడీ మీద టమాటాల్ని అమ్మటం మొదలు పెట్టారు.
దీంతో.. ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించినా.. వరదల కారణంగా సరఫరా తగ్గటంతో మళ్లీ ధరలకు రెక్కలు వచ్చాయి. ఢిల్లీలో మదర్ డెయిరీకి చెందిన స్టోర్ లో కేజీ టమాటాను రూ.259 చొప్పున అమ్ముతున్నారు. మరికొద్ది రోజులు పంట రావటానికి టైం పడుతుందని.. ఈ లోపు ట్రిపుల్ సెంచరీ ఖాయమంటున్నారు.