భోజనం ఖరీదెక్కింది. రోటి రైస్ రేట్ రిపోర్టు ఏం చెప్పింది?
గత ఏడాది (2023)తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో ఇంట్లో తయారు చేసుకునే భోజనం ధర ఎంత ఎక్కువన్న విషయాన్ని పేర్కొంటూ 11 శాతం పెరిగందన్నారు.
ఏడాది క్రితం సెప్టెంబరులో ఉన్న ఇంటి భోజనం ఖరీదుతో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబరులో భోజనం ఖరీదైన వ్యవహారంగా మారిందన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించిందో నివేదిక. శాకాహార భోజనం తయారీ ఖర్చు ఏడాదిలో ఎంత మారిందన్న విషయాన్ని వెల్లడించింది. ‘రోటి రైస్ రేట్’ రిపోర్టులో పలు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. ఏడాది వ్యవధిలో ఎంత ఖరీదెక్కిందన్న వివరాలతో పాటు.. దానికి కారణాల్ని కూడా ప్రస్తావించటం విశేషం.
గత ఏడాది (2023)తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో ఇంట్లో తయారు చేసుకునే భోజనం ధర ఎంత ఎక్కువన్న విషయాన్ని పేర్కొంటూ 11 శాతం పెరిగందన్నారు. గత ఏడాది సెప్టెంబరులో రూ.28.10గా ఉన్న భోజనం ఖరీదు ఈ ఏడాది రూ.31.30కు పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ పెరుగుదలకు కారణంగా టమాటా.. బంగాళదుంపల ధరలు పెరగటంగా పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ఉల్లిపాయ ధరలు 53 శాతం.. బంగాళదుంపల ఖరీదు 50 శాతం.. టమాటా ధర 18 శాతం పెరిగాయి. ఉల్లి.. బంగాళ దుంపల సరఫరా తగ్గటంతో వీటి ధరలు పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం ధరలు తగ్గాయి. ఏడాది క్రితం సెప్టెంబరు ధరలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో మాంసాహార ధర 2 శాతం మేర తగ్గినట్లుగా వెల్లడించింది. మాంసాహార భోజనం ఖర్చలో 50 శాతం వాటా ఉండే బ్రాయిలర్ చికెన్ ధర 14 శాతం తగ్గిందని.. ఈ కారణంగానే నాన్ వెజ్ మీల్స్ ధర తగ్గినట్లుగా పేర్కొన్నారు.
అదే సమయంలో ఆగస్టుతో పోలిస్తే నాన్ వెజ్ భోజనం ధరలో ఎలాంటి మార్పు లేదన్నారు. మరో విషయం ఏమంటే.. శాఖాహార భోజనంలో ధరలు పెరగటానికి పప్పుల ధరలు కూడా కారణంగా పేర్కొన్నారు. పప్పుల ధరలు 14 శాతం పెరిగాయని.. అదే సమయంలో వంట గ్యాస్ ఖర్చు 11 శాతం తగ్గటంతో.. కాస్త తక్కువ ధరగా కనిపించినట్లు చెప్పాలి. ఏమైనా.. నాన్ వెజ్ భోజనంతో పోలిస్తే వెజ్ భోజనం ఖరీదైన వ్యవహారంగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.