బాడీ నుంచి బ్రెయిన్ వేరు చేసినా సజీవంగా ఉండే డివైజ్!?

అద్భుత ఆవిష్కరణ ఒకటి తెర మీదకు వచ్చింది. మనిషి శరీరం నుంచి వేరే అవయువాల్ని పరిమిత సమయం లోపు మరో మనిషి లోపల అమర్చటం సంగతి తెలిసిందే

Update: 2023-11-16 04:30 GMT

అద్భుత ఆవిష్కరణ ఒకటి తెర మీదకు వచ్చింది. మనిషి శరీరం నుంచి వేరే అవయువాల్ని పరిమిత సమయం లోపు మరో మనిషి లోపల అమర్చటం సంగతి తెలిసిందే. అయితే.. పరిమిత సమయంలోపు మనిషి లోపల అమర్చకపోతే అవెందుకు పనికి రావు. అవయువాల తరలింపు కోసం గ్రీన్ చానల్ ఏర్పాటు చేయటం.. ఆగమేఘాల మీద వాటిని తరలించటం చూస్తుంటాం. ఇదిలా ఉంటే.. సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తారు.

శరీరం నుంచి మెదడును వేరు చేసినప్పటికీ ఎక్కువ సేపు సజీవంగా ఉంచేందుకు వీలుగా ఒక డివైజ్ ను శాస్త్రవేత్తలు కనిపెట్టిన వైనం రానున్న రోజుల్లో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీల్లో కీలకభూమిక పోషిస్తుందని చెబుతున్నారు. పంది మెదడును మనుషుల్లోకి ఏర్పాటు చేయటం తెలిసిందే. పంది శరీరం నుంచి వేరు చేసినప్పటికీ.. ఎక్కువసేపు దాన్ని సజీవంగా ఉంచేందుకు ఈ డివైజ్ ను డెవలప్ చేశారు.

మెదడుకు రక్త ప్రవాహాన్ని వేరు చేయటం.. కంప్యూటరైజ్డ్ అల్గారిథం ద్వారా అవసరమైన పిజియోలాజికల్ పారామీటర్స్ ను మొయింటైన్ చేయటంతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ ప్రయోగం మానవ మెదడును అధ్యయనం చేయటానికి కొత్త దారుల్ని తీసుకొస్తుందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో మెదడును మార్చే సర్జరీలో సరికొత్త మార్పులకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

శాస్త్రవేత్తలు తయారు చేసిన సరికొత్త డివైజ్ తో పంది మెదడును బయటకు తీసిన ఐదు గంటల పాటు మెదడు సజీవంగా ఉండే వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనతో న్యూరో సైన్స్ లో కీలక మార్పులకు సాధ్యమవుతాయని భావిస్తున్నారు. ప్రయోగాల సమయంలో సెరిబ్రల్ ఫిజియోలాజికల్ పారామీటర్స్ నియర్ - నేటివ్ లెవల్స్ ను పరిశీలించారు. మెదడు పనితీరుపై లోతైన అవగాహన పెంచుకునేందుకు సాధ్యమవుతుందని చెబుతున్నారు.

అయితే.. ఈ ప్రయోగం మనుషుల మీద జరగనప్పటికీ.. ఇప్పుడు పంది మెదడుపై జరుగుతున్న రీసెర్చ్ రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్లే వీలుందని భావిస్తున్నారు. అదే జరిగితే.. బ్రెయిన్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ కు కొత్త దారుల్ని ఏర్పరుస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News