వైద్యరంగంలో సరికొత్త సంచలనం..ఆస్టియోపొరోసిస్ పై ఏఐ పోరాటం..

ఇటువంటి వాటి వల్ల ముందుగానే మనం మన ఎముకలకు కలిగే హాని గురించి తెలుసుకోవడం సాధ్యపడుతుంది.

Update: 2024-07-02 23:30 GMT

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఎముకలు ఒకటి. శరీరానికి భూతాన్ని ఇచ్చే ఎముకలు ఎంత బలంగా ఉంటే మనం అంత బలంగా ఉంటాము. అటువంటి ఎముకలను గొల్లభారచేటటువంటి ఆస్టియోపొరోసిస్ వ్యాధి గురించి ముందుగానే పసిగట్టడం కోసం ఒక కృత్రిమ మేధస్సు నమోనా అని సిద్ధం చేశారు.

ఇటువంటి వాటి వల్ల ముందుగానే మనం మన ఎముకలకు కలిగే హాని గురించి తెలుసుకోవడం సాధ్యపడుతుంది. అమెరికాలోని టులేన్

విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ సరికొత్త ఘనతను సాధించారు. మరి దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..

ఆస్టియోపొరోసిస్ అంటే ఏమిటి?

ఆస్టియోపొరోసిస్ ను బోలు ఎముకల వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది మన ఎముకలను చాలా నిశ్శబ్దంగా బలహీన పరుస్తుంది. ఈ వ్యాధి సోకిన వారి ఎముకలు సాంద్రత బాగా క్షమించి బలహీనపడతాయి. వయసుతోపాటు ఈ వ్యాధి మరింత జటిలంగా మారుతుంది. ఈ వ్యాధి సోకిన వారికి చిన్నపాటి పనులు చేసుకోవడం కూడా అత్యంత కష్టతరం అవుతుంది.

పలు రకాల అధ్యయనాల ద్వారా ఈ వ్యాధికి కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. వీటిలో వయస్సు, అధిక బరువు, అధిక రక్తపోటు లాంటి సమస్యలతో పాటు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనల కోసం 40 సంవత్సరాలు పైబడిన 8వేల మందికి సంబంధించిన డేటా ను ఉపయోగించారు.

ఈ డేటా ని ఉపయోగించి సాంకేతికంగా ఒక డీప్ లెర్నింగ్ అల్గోరిథమును శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను దీనిని రూపొందించడం వల్ల భవిష్యత్తులో ఎందరికో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. మానవ మేధస్సుకు సమానంగా పనిచేయగలిగే.. భారీ డేటాను పరిశీలించి, విభిన్న పోకడలను గుర్తిస్తుంది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది కొత్త పోకడలతో వైద్య సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులో తేవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ సరికొత్త ఏఐ నమూనా సహాయంతో ఎందరినో సైలెంట్ గా దెబ్బతీస్తున్న ఆస్టియోపొరోసిస్ ముప్పును ముందుగానే పసిగట్టవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇటువంటి రుగ్మతలకు వీలైనంత త్వరగా నివారణ చర్యలు చేపట్టడం ఎంతో అవసరం. అందుకే దీనిపై మరిన్ని పరిశోధనలు కూడా చేపట్టబోతున్నారు.

Tags:    

Similar News