క్యాన్సర్ కు సొంత వైద్యం... నయమవ్వడం గమనార్హం!
ఈ విషయంలో ఓ మహిళ తనకు తానే ట్రీట్ మెంట్ చేయించుకుని.. నయం చేసుకున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాధి అనేది తెలిసిన విషయమే! అది శారీరకంగా మనిషిని ఇబ్బంది పెట్టే కంటే ఎక్కువగా మానసికంగా కృంగదీసేస్తుందని అంటారు! ఇక కీమోథెరపీ చేయించుకోవడాన్ని భరించలేరని చెబుతుంటారు. ఈ విషయంలో ఓ మహిళ తనకు తానే ట్రీట్ మెంట్ చేయించుకుని.. నయం చేసుకున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... క్రొయేషియాకు చెందిన సైంటిస్ట్ బియాటా హలాసీ (49) జాగ్రేబ్ వర్శిటీలో వైరాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఆమెకు గతంలో రొమ్ము క్యాన్సర్ సోకి తగ్గింది. అయితే... 2020లో మళ్లీ సోకింది. ఈ సమయంలో... తన ల్యాబ్ లోనే తయారుచేసిన రెండు వైరస్ లను తనకు తానే ఇంజెక్ట్ చేసుకుని క్యాన్సర్ ను వదిలించుకున్నట్లు చెబుతున్నారు.
ఆమె క్యాన్సర్ మూడవ దశలో ఉండగా.. మరొక రౌండ్ కీమోథెరపీ చేయించుకోవడాన్ని ఆమె భరించలేకపోయిందని.. ఈ సమయంలో సమస్యను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుందని.. ఫలితంగా సొంత వైద్యంతో సుమారు నాలుగు సంవత్సరాలపాటు పోరాడి క్యాన్సర్ నుంచి ఆమె విముక్తి పొందారని అంటున్నారు.
ఈ క్రమంలో ఈమె ఆంకోలైటిక్ వైరోథెరపీ విధానాన్ని అనుసరించారని.. ఇది వైరస్ లను ఉపయోగించుకుంటుందని అంటున్నారు. ఇది ఒక వైపు క్యాన్సర్ కణాలపై నేరుగా దాడి చేస్తూ.. మరోవైపు వాటిని తటస్థీకరించడానికి రక్షణ వ్యవస్థను సమీకరించిందని చెబుతున్నారు. దీంతో... ప్రస్తుతం ఈ విషయం వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ వైకోథెరపీకి ప్రత్యేక జ్ఞానం అవసరం కాబట్టి.. ఆమెను ఎవరూ అనుకరించడానికి ప్రయత్నించొద్దని చెబుతున్నారు.