యూరిక్ యాసిడ్ ను ఇట్టే తొలగించే ఈ అద్భుతమైన ఆకు గురించి మీకు తెలుసా?
చెడు అలవాట్లు, బిజీ లైఫ్ స్టైల్, డ్రింక్స్ ఇలా ఎన్నో కారణాలవల్ల మన శరీరంలో అనేక రసాయనాలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి యూరిక్ యాసిడ్.
ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా 30 సంవత్సరాల దాటకముందే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టూ ముడుతున్నాయి. పైగా మనం తీసుకునే ఆహారంలో ఎటువంటి పౌష్టిక విలువలు, విటమిన్స్ శరీరానికి అందడం లేదు. ఇక వీకెండ్స్ అయితే పార్టీస్ అంటూ యువత చేసే హడావిడి అంతా ఇంతా కాదు. చెడు అలవాట్లు, బిజీ లైఫ్ స్టైల్, డ్రింక్స్ ఇలా ఎన్నో కారణాలవల్ల మన శరీరంలో అనేక రసాయనాలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి యూరిక్ యాసిడ్.
ఇది మన శరీరంలో పెరగడం వల్ల కీళ్లవాతం వస్తుంది. 40 సంవత్సరాలు కూడా రాకముందే 4 అంతస్తులు ఎక్కడానికి మోకాళ్లు పట్టేసుకుంటారు. మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి 7.0 mg/dl కంటే అధికంగా ఉంటే అది కీళ్లలో స్పటికం రూపంలో పేరుకుపోతుంది. దీంతో కాస్త నడిచినా నొప్పి రావడం, కాళ్లు చేతులు వాయడం, రాత్రులు కాళ్ల నొప్పులకు నిద్ర పట్టకపోవడం మనం గమనించవచ్చు. అయితే వీటిని తగ్గించుకోవడం కోసం కెమికల్స్ తో నిండిన మాత్రలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద ఓ చిన్న చిట్కా వైద్యం చేస్తే సరిపోతుంది.
శరీరంలో ఎక్కువ మోతాదులో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ తొలగించడానికి కాస్త తమలపాకులు ఉంటే సరిపోతుంది. ఎన్నో పోషక విలువలు కలిగిన తమలపాకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్స్, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ,యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
తమలపాకు ఎలా వాడాలి?:
అయితే తమలపాకుల కోసం మీరు కిళ్ళీలు తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. భోజనం తిన్న తర్వాత ఫ్రెష్ గా రెండు తమలపాకులను కాస్త తేనెలో ముంచుకొని నమిలితే సరిపోతుంది. లేదా రెండు తమలపాకులను సన్నగా తరిగి వేడి నీటిలో మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నీటిలో కాస్త తేనె కలుపుకొని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల మీ యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడమే కాదు శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు, మెటబాలిజం పెరిగి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలు కూడా కరుగుతాయి.