స్మోకింగ్ మానాలి అనుకునే వారికి..ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించే మార్గదర్శకాలు

ఈ అలవాటు ఎంత ప్రాణాంతకమైనదో తెలియజేస్తూ.. స్మోకింగ్ ఎందుకు వదిలేయాలి అనే విషయంపై నిపుణుల చేత కౌన్సిలింగ్ కూడా ఇప్పించే దిశగా చర్యలు చేపడుతోంది ఈ సంస్థ.

Update: 2024-07-04 09:30 GMT

సరదాగా అలవాటు చేసుకుని.. ఆ తర్వాత వదులుకోలేక సతమతమయ్యే అలవాట్లలో ధూమపానం ఒకటి. మీ ఆరోగ్యంతో పాటు పక్కన వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసే ఈ అలవాటు మానడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేమిటో తెలుసుకుందాం పదండి..

ధూమపానం ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బంది కలిగించే అలవాటు. ఈ విషయం సిగరెట్ తాగే వాళ్లకే కాదు అమ్మే వాళ్ళకి కూడా బాగా తెలుసు. కానీ ఆదాయం వస్తుంది కదా అని.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అన్నట్టు కంపెనీలు వ్యవహరిస్తాయి. మరోపక్క సిగరెట్ తాగడం పెద్ద ఫ్యాషన్ అని ఫీల్ అయ్యి యువత చిన్నతనం నుంచే అనవసరంగా ఈ అలవాటుకు బలైపోతున్నారు. స్వతహాగా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప మానలేని అలవాట్లలో ఇది ఒకటి. ఈ అలవాటు కంట్రోల్ చేసుకోవడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు. అందుకే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధూమపానం మానడం కోసం సహాయపడే విధంగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

డ్రింకింగ్ లాగా స్మోకింగ్ కూడా మీ ప్రాణాలతో చలగాటం ఆడగలదు. ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ చేసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. వీళ్ళ కారణంగా పక్కన వాళ్ళ ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. అయితే ఇటువంటి అలవాట్లు మానాలి అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి రిహాబిటేషన్ సెంటర్లకు వెళ్లాల్సి ఉంటుంది .ఇంత ఖర్చు అందరూ భరించలేరు కాబట్టి చాలామంది అసలు ఈ సమస్యను తగ్గించడంపై శ్రద్ధ పెట్టరు.అందుకే ఈ పొగాకు వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అది తక్కువ ఖర్చుతో ఈ సమస్యను తగ్గించుకుని చికిత్సలను అందివ్వడానికి నిర్ణయించుకుంది.

Read more!

అదేనాల ప్రకారం ప్రపంచంలోని 1.25 బిలియన్ల పొగాకు వినియోగదారులలో 60 శాతం కంటే ఎక్కువమంది ఈ అలవాటును మానుకోవాలి అని అనుకుంటున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా ఈ అలవాటుకి వారు దూరంగా ఉండలేకపోతున్నారు. అటువంటి వారి కోసం ఈ వ్యసనాన్ని అధిగమించడంలో సహాయంగా ఉండడానికి WHO ముందుకు వచ్చింది. మరి ముఖ్యంగా ఈ అలవాటు ఎక్కువగా కనిపించే గ్రామీణ ప్రాంతాలలో దీనిపై అవగాహన కల్పించడానికి నడుం బిగించింది.

WHO మార్గదర్శకాలు:

స్మోకింగ్ అలవాటు మానాలి అంటే ముందుగా మన మెదడుపై మనకు పూర్తి నియంత్రణ రావాలి. అందుకే పొగాకు బదులుగా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ,బుప్రోరియన్,వారెనిక్లైన్,సైటిసిన్ వంటి మందుల వాడకాన్ని WHO సిఫార్సు చేస్తుంది. అంతేకాదు స్మోకింగ్ చేయాలి అనిపించిన ప్రతిసారి సిగరెట్ కు బదులుగా వాడడానికి నికోటిన్ గమ్,ప్యాచ్లను కూడా ఆమోదించింది.

ఈ అలవాటు ఎంత ప్రాణాంతకమైనదో తెలియజేస్తూ.. స్మోకింగ్ ఎందుకు వదిలేయాలి అనే విషయంపై నిపుణుల చేత కౌన్సిలింగ్ కూడా ఇప్పించే దిశగా చర్యలు చేపడుతోంది ఈ సంస్థ. ఈ కౌన్సిలింగ్ 30 సెకండ్ల నుంచి మూడు నిమిషాల వరకు ఉంటుంది. వ్యక్తిగత లేక గ్రూప్ కాలింగ్ పద్ధతి ద్వారా ఈ కౌన్సిలింగ్ ని తీసుకునే వసతి ఉంది. స్మార్ట్ ఫోన్ లో వాడకం ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ఈ యాప్ ని ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు.

స్మోకింగ్ మానేయడానికి ఎవరు ఎంత ప్రయత్నించినా స్వతహాగా మీ నుంచి సొంత ప్రయత్నం ఉండాలి. మీరు ఏ రోజు నుంచి స్మోకింగ్ మానేయాలి అనుకుంటున్నారు ఆ డేట్ ని క్యాలెండర్ లో నోట్ చేసుకోండి. ప్రతిరోజు మీకు మీరు ఈ చెడు అలవాటుకు వాటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీ ఇంట్లో వారితోపాటు, ఫ్రెండ్స్, బంధువులు అందరికీ మీరు స్మోకింగ్ మానేస్తున్నట్లుగా చెప్పండి. ఇలా చెప్పడం వల్ల మీరు ఒకవేళ స్మోక్ చేయాలి అనుకున్నా.. వాళ్లు మిమ్మల్ని కంట్రోల్ చేయగలుగుతారు. వ్యాయామం, యోగ, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. మరి స్మోకింగ్ చేయాలి అనిపించినప్పుడు మెదడుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి తేలికపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్మోకింగ్ సులభంగా ఆపవచ్చు.

Tags:    

Similar News

eac