చికెన్ గున్యా తగ్గినా 3 నెలల వరకు మరణముప్పు

చికెన్ గున్యా బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్ మూడు నెలల వరకు ఉంటుందన్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంటున్నారు

Update: 2024-02-15 23:30 GMT

ఇటీవల జరిపిన అధ్యయనం సరికొత్త నిజాల్ని బయటకు తీసింది. చాలామంది పెద్దగా పట్టించుకోని చికెన్ గున్యాతో ప్రాణాలు పోయేంత సీరియస్ అవుతుందన్నది తెలిసిందే. అయితే.. చికెన్ గున్యా తగ్గిన తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. చికెన్ గున్యా తగ్గిన మూడు నెలల వరకు లైట్ తీసుకోవద్దని స్పష్టం చేస్తున్నారు.

చికెన్ గున్యా బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్ మూడు నెలల వరకు ఉంటుందన్న విషయాన్ని గుర్తించినట్లు పేర్కొంటున్నారు. వైరస్ తగ్గిందని నిర్లక్ష్యం చేస్తే.. మూడు నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆ వివరాల్ని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డీసెజెస్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. దోమల ద్వారా మనుషులకు వ్యాపించే వైరల్ వ్యాధి అన్న విషయం తెలిసిందే. చికున్ గున్యా బారిన పడి కోలుకున్న 15 లక్షల కేసుల్ని పరిశీలించిన బ్రిటన్ లోని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎన్నీ డాక్టర్ పైక్సావో క్రూజ్ టీం కీలక అంశాల్ని గుర్తించింది. హెచ్చరిస్తున్నారు.

చికెన్ గున్యా బారిన పడినోళ్లు పూర్తిగా కోలుకున్నప్పటికీ చాలామందికి ఇది ప్రాణాలకు మీదకు తీసుకొస్తుంటుంది. సాధారణంగా చికున్ గున్యా తీవ్రత వైరస్ సోకిన తర్వాత పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది. ఆ దశ ముగిసిన తర్వాత కూడా దాని తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చికున్ గున్యా తగ్గిన తర్వాత ఆరోగ్య సమస్యల మీద అప్రమత్తంగా ఉండాలని.. ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నది మర్చిపోకూడదు. సో.. బీకేర్ ఫుల్.

Tags:    

Similar News