మెట్లు ఎక్కితే నిమిషానికి ఖర్చుఅయ్యే కేలరీలు ఎంతో తెలుసా?

బరువు తగ్గాలన్నా.. బాడీ షేప్ బాగా ఉండాలనుకునే వారంతా చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనది మెట్లు ఎక్కటం.

Update: 2024-09-21 06:58 GMT

బరువు తగ్గాలన్నా.. బాడీ షేప్ బాగా ఉండాలనుకునే వారంతా చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనది మెట్లు ఎక్కటం. అయితే.. మెట్లు ఎక్కే విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. కానీ.. పద్దతి ప్రకారం మెట్లు ఎక్కే అలవాటుతో క్యాలరీలను ఖర్చు చేసే వీలుంటుంది. మిగిలిన పనులతో పోలిస్తే మెట్లు ఎక్కటం ద్వారా భారీగా క్యాలరీలను ఖర్చు చేసే వీలుంటుంది. ఒక అంచనా ప్రకారం నిమిషం పాటు మెట్లు ఎక్కితే ఖర్చు అయ్యే కేలరీలు ఎంతో తెలుసా? అక్షరాల ఏడు క్యాలరీలు. ఇంత భారీగా మరే పని చేసినా ఖర్చు కావంటున్నారు.

ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండాలంటే వారానికి మూడు నుంచి ఐదు రోజుల పాటు రోజు అరగంట పాటు మెట్లు ఎక్కే వ్యాయామం చేయాలని చెబుతున్నారు. ఇలా చేసే టైంలో షూ ధరిస్తే మంచిదని చెబుతున్నారు. ఈ షూలు మడమ భాగంంలో మందంగా.. మెత్తగా ఫ్లెక్సిబుల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా సౌకర్యవంతంగా ఉండే షూ ధరించటం కారణంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. దీంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగు అవుతుంది.

రోజు మెట్లు ఎక్కటం వల్ల శరీర బరువంతా మోకాళ్లు.. తొడ కండరాల మీద ఎక్కువగా ఉంటుంది. ఈభాగాల్లో పేరుకున్న కొవ్వు కరిగేందుకు వీలుంటుంది. అంతేకాదు.. కండరాలు బలంగా మారతాయి. దీంతో.. బాడీ షేక్ కూడా ఉంటుంది. రోజు మెట్లు ఎక్కే అలవాటుతో క్యాలరీలు సులువుగా కరిగిపోతాయి. బరువు తగ్గాలనుకునే వారు కచ్ఛితంగా మెట్లు ఎక్కే కార్యక్రమాన్ని ఉద్యమంగా చేస్తే ప్రయోజనం ఉంటుంది. అయితే..ఇక్కడో మాట చెప్పాలి. మెట్లు ఎక్కేటప్పుడు మరీ వేగంగాకాకుండా కాస్తంత నెమ్మదిగా చేస్తే మంచిది.

మెట్లు ఎక్కే వారిలో గుండె సంబంధిత సమస్యలు.. మోకాలు.. మడమ.. కీళ్లు.. నడుము లాంటి భాగాల్లో నొప్పి.. ఇతరత్రా సమస్యలు ఉంటే మాత్రం ఇలాంటి వారు మెట్లు ఎక్కకపోతేనే మంచిది. ఒకవేళ అలా చేస్తే నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. కాబట్టి.. జాగ్రత్తలు తీసుకోవాలి. మెట్లు ఎక్కటం ద్వారా గుండెకు రక్తప్రసరణ సరిగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడే వీలుంటుంది. ఇంకెందుకు మెట్లు ఎక్కే పని మొదలుపెట్టండి.

Tags:    

Similar News