మీరు సైక్లింగ్ చేస్తున్నారా ?

ప్రధాన పరిశోధకుడైన హ్యూస్టన్‌కు చెందిన డాక్టర్‌ గ్రేస్‌ లో మాట్లాడుతూ ‘‘సైక్లింగ్‌ వల్ల మోకాళ్ల ఆరోగ్యం బాగుంటుందని

Update: 2024-05-22 04:41 GMT

మారిన ఆహారపు అలవాట్లతో పాటు తాగుతున్న నీరు, తినడానికి వినియోగిస్తున్న కూరగాయలు, ధాన్యాల మూలంగా నాలుగు పదుల వయసు రాక ముందే అందరికీ మోకాళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. అయితే సైక్లింగ్ చేసే వారికి మోకాళ్ల నొప్పులు 17 శాతం, కీళ్లవాతం 21 శాతం తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని తాజా అధ్యయనంలో వెల్లదయింది. 60 ఏండ్ల వయసు కలిగిన 2600 మందికి పైగా వ్యక్తులను అధ్యయనం చేసి నివేదికను విడుదల చేశారు.

ప్రధాన పరిశోధకుడైన హ్యూస్టన్‌కు చెందిన డాక్టర్‌ గ్రేస్‌ లో మాట్లాడుతూ ‘‘సైక్లింగ్‌ వల్ల మోకాళ్ల ఆరోగ్యం బాగుంటుందని.. కీళ్లకు జరిగే నష్టం కూడా తక్కువ’’ అని తెలిపారు. ఎనిమిదేండ్ల పాటు జరిగిన ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిని వారి జీవితంలో వివిధ దశల్లో తీరిక సమయంలో చేసిన వ్యాయామాల గురించి ఆరా తీశారు.

12-18 ఏండ్ల వయసు కలిగినప్పుడు సైక్లింగ్‌ చేసినవారిలో కండరాలు బలపడ్డాయని..ఆ తర్వాత వారు సైక్లింగ్‌ మానేసినా కండరాల పటిష్టత కొనసాగిందని అధ్యయనంలో తేలింది. మోకాళ్ల చుట్టూ ఉండే కండరాలు సైక్లింగ్‌ వల్ల దృఢంగా మారతాయని, కీళ్ల జాయింట్ల కదలికలు కూడా మెరుగవుతాయని పరిశోధకులు వివరించారు. సైక్లింగ్‌ వల్ల శరీర బరువు అదుపులో ఉండడంతో బరువు వల్ల కీళ్లపై ఒత్తిడి పెరుగుతున్నదని చెబుతున్నారు.

Tags:    

Similar News