ఫ్రిజ్ లో ఉంచిన ఆహారాలు వేడిచేసి తింటున్నారా... ఇదొకసారిచదవండి!
వేడి వేడి ఆహారం తీసుకోవాలి.. ఫ్రెష్ గా ఉన్న కూరగాలు, మీట్ అప్పటికప్పుడు వండుకుని తినాలి అని వైద్యులు నిత్యం చెబుతుంటారు.
వేడి వేడి ఆహారం తీసుకోవాలి.. ఫ్రెష్ గా ఉన్న కూరగాలు, మీట్ అప్పటికప్పుడు వండుకుని తినాలి అని వైద్యులు నిత్యం చెబుతుంటారు. సాధారణంగా గ్రామాల్లో అయితే చేపల కూరను ఒక పూట నిల్వ ఉంచి తింటే బాగుంటుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయిన జీవనశైలో చాలా మంది ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన ఫుడ్డే తింటున్న సంగతి తెలిసిందే.
బిజీ లైఫ్, పూర్తిగా మారిన జీవనశైలి కారణంగా ఇప్పుడు ఇంట్లో ఫ్రెష్ ఫుడ్ తినే ఛాన్స్ చాలా మందికి లేదనేది తెలిసిన విషయమే. ఉదయం వండుకున్న కూరలు రాత్రికి వేడిచేసుకుని తినే అలవాటునే అధికశాతం మంది వ్యసనంగా మార్చుకున్నారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో... ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసుకుని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయని అంటున్నారు వైద్యులు!
అవును... ఆరోగ్యంగా ఉండటానికి.. సమతుల్య దినచర్య, మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమని చెబుతున్న వైద్యులు... ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని పదేపదే వేడి చేయడం వల్ల దానిలోని పోషకాలు నాశనం అవ్వడమే కాకుండా.. అనేక రోగాలతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఏయే ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి తిరిగి వేడి చేసి తినకూడదనే విషయాన్ని సవివరంగా వివరిస్తున్నారు!
ఈ లిస్ట్ లో ముందుగా ఉన్నది అన్నం! అవును... చాలా మంది రాత్రి పూట మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిజ్ లో ఉంచుతారు. దానిని ఉదయం వేడి చేసుకుని తింటారు. కొంతమంది దీంతో పులిహోర వంటి రకరకాల వంటకాలు కూడా తయారు చేస్తుంటారు. అయితే ఒక అధ్యయనం ప్రకారం.. చద్దన్నం వేడి చేసి తినడం వల్ల అది టాక్సిక్ ఫుడ్ గా మారుతుందట.
ఈ లిస్ట్ లో అన్నం తర్వాత ముఖ్యంగా, ఎక్కువగా నిల్వ ఉంచేది నాన్ వెజ్ కూరలనే చెప్పుకోవాలి. చేపలు, మాంసం వంటి నాన్ వెజ్ ఆహారాలను ఒక సారి వండిన తర్వాత ఫ్రిజ్ లో దాచుకుని రెండు మూడు రోజులు తింటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆ మాంసాహారం కాస్తా విషంగా మారుతుందట. ఇది శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక గ్రీన్ వెజిటబుల్స్ విషయానికొస్తే... వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచి వేడిచేస్తే మరింత ప్రమాదం అని అంటున్నారు! గ్రీన్ వెజిటేబుల్స్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయనేది తెలిసిన విషయమే. వీటిలో నైట్రేట్లు ఉండటం వల్ల వీటిని పదే పదే వేడిచేసినప్పుడు క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఫ్రెష్ గా వండుకుని తింటే ఎంత మేలో.. ఫ్రిడ్జ్ లో నుంచి తీసి వేడిచేసుకుని తింటే అంతే డేంజర్ అన్నమాట.
ఇకపై ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని, ఆరోగ్య నిపుణుల సలహాలు స్వీకరించి, ఇలా ఫ్రిడ్జ్ లో ఆహారాన్ని పదే పదే వేడి చేసుకుని తినడం మానేస్తే అరోగ్యం అన్నమాట!!