అరటిపండులో ఇవి గమనించారా ?

మిగతా సీజనల్ పండ్ల మాదిరిగా కాకుండా అన్ని సీజన్లలో ఇది అందుబాటులో ఉండడమూ దీనికి ముఖ్యకారణం.

Update: 2024-05-10 04:15 GMT

మార్కెట్ లో ఉన్న అని పండ్ల కన్నా ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉండేది అరటిపండు. దీని ధరలు కూడా సాామాన్యులకు అందుబాటులో ఉండడం మూలంగానే ఎక్కువ మంది అరటిపండ్లను ఇష్టపడుతుంటారు. మిగతా సీజనల్ పండ్ల మాదిరిగా కాకుండా అన్ని సీజన్లలో ఇది అందుబాటులో ఉండడమూ దీనికి ముఖ్యకారణం.

అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం అధికంగా లభిస్తాయి. అంతేకాదు దీనిని తినడం, జీర్ణం చేసుకోవడం చాలా సులభం. అయితే వేసవిలో ప్రతి రోజు తీసుకునే ఆహారంతో పాటు అరటిపండును కూడా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో వీటిని తీసుకోవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి ఎసిడిటీ, కాళ్ల తిమ్మిరిని నివారిస్తాయి.హైపోథైరాయిడిజంను కంట్రోల్‌ చేస్తాయి.

గర్భిణులు అరటిపండు తినడం వల్ల అలసట నుంచి ఉపశమనం పొందుతారు. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మంచి కొవ్వులు శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండులో ఉన్న ఫైబర్ మూలంగా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో పేగులు బాగుంటే మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం ఉన్న వారు రోజుకు ఒక అరటిపండు తీసుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News