పురుషులు, మహిళల్లో గుండెపోటు లక్షణాలు తేడా..? ఎలా గుర్తించాలి?
ఇదెలా ఉన్నప్పటికీ.. పురుషులు, మహిళల్లో ఉండే గుండె ఒకే విధంగా ఉన్నప్పటికీ.. వచ్చే గుండెపోటు లక్షణాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
గుండెపోటు. ఇది ఒకప్పుడు 45 ఏళ్లు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించేది. కానీ, ఇప్పుడు వయసులతో సంబంధం లేకుండా.. విస్తరిస్తోంది. దీనికి పనివేళలు, ఆహారపు అలవాట్లు వంటివి కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇదెలా ఉన్నప్పటికీ.. పురుషులు, మహిళల్లో ఉండే గుండె ఒకే విధంగా ఉన్నప్పటికీ.. వచ్చే గుండెపోటు లక్షణాలు మాత్రం వేర్వేరుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఇవి ఏంటి? ఎలా గుర్తించాలనే విషయాన్ని పరిశీలిద్దాం.
చెమటలు పట్టడం, వికారం, మైకం, అసాధారణ అలసట సాధారణ గుండెపోటు లక్షణాలు. ఇవి మహిళ ల్లో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, విశ్రాంతి, నిద్రలో ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలతో గుండె పోటు తరచుగా సంభవిస్తుందని తేలింది. అయితే, పురుషుల మాదిరిగా కాకుండా, ఛాతీలో నొప్పి, ఒత్తిడి, అసౌకర్యం వంటివి మహిళలలో తీవ్రంగా ఉండవు. అందుకే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తమ శారీరక ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మాయో క్లినిక్ పరిశోధకులు వెల్లడించారు.
మహిళలు గుండెపోటు లక్షణాల విషయంలో తరచుగా అస్పష్టంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. శ్వాస ఆడకపోవడం, వికారం/వాంతులు, వెన్ను, దవడ నొప్పి ఉంటాయని తెలిపారు. ఇతర స్త్రీలు తల తిరగడం, ఛాతీ కింది భాగంలో లేదా పొత్తికడుపు పైభాగంలో నొప్పి, విపరీతమైన అలసటను అనుభవిస్తారని పేర్కొన్నారు.
"మొదట గుండె జబ్బులకు కారణమయ్యే ప్రమాదకర అంశాలను గుర్తించడం చాలా ముఖ్యం. అంతేకాదు, ఆ ప్రమాదాన్ని తీవ్రతరం చేసే ప్రవర్తనలను అరికట్టడానికి ఏం చేయాలనేది కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం" అని మంకాటోలోని మాయో క్లినిక్ హెల్త్ సిస్టమ్‌లోని ఫ్యామిలీ మెడిసిన్ వైద్యుడు చతుర ఆలూర్ వ్యాఖ్యానించారు.
"అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి సాంప్రదాయ ప్రమాదాలుగా పరిగణించబడే వాటి కంటే మహిళల్లో గుండె జబ్బులు రావడానికి కొన్ని కారకాలు మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి" అని ఆలూర్ తెలిపారు. గుండె జబ్బులను నివారించడానికి, మహిళలు మధుమేహం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, నిరాశకు గురికాకుండా ఉండడం, ధూమపానం నిలిపివేయడం, నిశ్చల జీవనశైలిని అవలంభించాలని సూచించారు. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్, గర్భధారణ సమస్యలతో సహా కొన్ని పరిస్థితులు కూడా మహిళల గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయని తెలిపారు.
అన్ని వయసుల మహిళలు కూడా గుండె జబ్బులను తీవ్రంగా పరిగణించాలని డాక్టర్ ఆలూర్ పేర్కొన్నారు."చాలా మంది స్త్రీలు తమ లక్షణాలను గుర్తించడం లేదు. గుండె జబ్బులు సంభవించే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మహిళలు తమ శరీరాల్లో కనిపిస్తున్న మార్పులను గుర్తించడం లేదు. వారికి సాధారణంగా అనిపించే వాటిని అర్థం చేసుకోవడం, ముందు జాగ్రత్త తీసుకోవడం అత్యంత ముఖ్యం. లేక పోతే.. గుండె జబ్బుల లక్షణాలు తీవ్రమవుతాయి`` అని వివరించారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) అంచనా ప్రకారం.. గర్భనిరోధక మాత్రలు, ధూమపానం వంటివి యువతుల్లో 20 శాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్నాయని తెలిసింది. ఒక్కొక్క సారి ఈ లక్షణాలు లేకుండా కూడా.. మహిళలకు గుండెపోటు రావచ్చునని పేర్కొన్నారు. కరోనరీ హార్ట్ డిసీజ్‌తో అకస్మాత్తుగా మరణించే మహిళల్లో 64 శాతం మందికి ముందస్తు లక్షణాలు లేవని తెలిపింది.
మహిళల వయసు, వారి కుటుంబ చరిత్ర వంటివి పరిశీలిస్తే.. అతిగా తినడం, నిశ్చల జీవనశైలిని నడిపించడం వంటివి కాలక్రమేణా తగ్గిపోయాయి. ఇవి కూడా గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. ప్రతి యువతీ 20 సంవత్సరాల వయసులో కొలెస్ట్రాల్‌ను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అదేసమయంలో గుండె జబ్బుతో తమ కుటుంబంలో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే.. వారి చరిత్రను కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకుని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.