ప్రముఖ నటికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌

ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ప్రముఖ నటి హీనా ఖాన్ కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్ బారిన పడింది.

Update: 2024-06-28 10:56 GMT

సినీ ప్రముఖులు క్యాన్సర్‌ బారిన పడటం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం. కొంత మంది చికిత్స తీసుకుని తిరిగి సాధారణ స్థితికి వస్తే కొందరు మాత్రం ప్రాణాలు వదులుతున్నారు. సినీ ప్రముఖుల్లో కొందరు క్యాన్సర్‌ చికిత్స కోసం విదేశాలకు వెళ్లి ఖరీదైన చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు.

ఈ మధ్య కాలంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా వినిపిస్తుంది. ఈ తరహా క్యాన్సర్‌ పై అవగాహణ కల్పించేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి స్టేజ్ లోనే దాన్ని గుర్తించడం ద్వారా నయం చేసుకోవడం సులభం. కానీ చాలా మంది కూడా దాన్ని మొదటి స్టేజ్ లో గుర్తించడంలో విఫలం అవుతున్నారు.

ఉత్తరాది బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ప్రముఖ నటి హీనా ఖాన్ కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్ బారిన పడింది. ఆ విషయాన్ని స్వయంగా హీనా ఖాన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాను మూడో స్టేజ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ తో బాధ పడుతున్నట్లుగా ఆమె చేసిన ప్రకటన అందరికీ విస్మయాన్ని కలిగిస్తుంది.

సోషల్‌ మీడియాలో హీనా ఖాన్‌.. నేను బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడ్డాను. క్యాన్సర్‌ తో నేను చేస్తున్న పోరాటంలో అండగా ఉండాలని, తనకోసం ప్రార్థించాలని అభిమానులను కోరుతున్నాను. మీ అందరి సపోర్ట్‌ తో త్వరలోనే క్యాన్సర్‌ ను జయిస్తాను అనే నమ్మకం ఉందని పోస్ట్‌ చేసింది.

పలు టీవీ సిరీస్‌ లతో పాటు బిగ్‌ బాస్ లో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న హీనా ఖాన్‌ త్వరగా క్యాన్సర్‌ నుంచి బయట పడాలని, ఆమె పూర్తి ఆరోగ్యంతో మళ్లీ కెమెరా ముందుకు రావాలని ఫ్యాన్స్ మరియు ఆమె సన్నిహితులు ప్రార్థనలు చేస్తున్నారు.

Tags:    

Similar News