చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది తెలుసా?
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు.
మనిషి పరిశుభ్రంగా ఉండకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేతి గోళ్లు కూడా శుభ్రంగా ఉంచుకోకపోతే అందులో ఉండే మట్టితో మనకు చాలా రకాల సమస్యలు వస్తాయని చిన్నప్పుడే చదువుకున్నాం. ఈనేపథ్యంలో పరిశుభ్రతే మనకు శ్రీరామరక్ష అని గుర్తుంచుకోవాలి. భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే మనకు నష్టాలు ఉండవు. ఈ విషయం చాలా మంది పాటించడం లేదు. ఏమవుతుందిలే అనే ధోరణితో ఆరోగ్యం మీద పెను ప్రభావం చూపేలా చేసుకుంటున్నారు.
చేతులు శుభ్రంగా కడుక్కోకోవడం వల్ల మెదడులో టేప్ వార్మ్స్ (బద్దె పురుగులు) చేరతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్ వెల్లడించింది. దీంతో చాలా వరకు అనారోగ్య సమస్యలు వేధిస్తాయని పేర్కొంది. బద్దె పురుగు కణజాలాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల అక్కడ నుంచి మెదడులోకి వెళ్తుందని తేల్చింది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పింది.
అడవి పంది మాంసం తినేవారిలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ మాంసం తినేవారిలో మలమూత్రాల ద్వారా కుటుంబ సభ్యులకు కూడా సోకే అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో టేప్ వార్మ్స్ వ్యాధి ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యాపించకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండటమే సురక్షితమని గుర్తించుకోవడం తప్పనిసరి.
ఉడకని పంది మాంసంతో డేంజర్ అని చెబుతున్నారు. అది తినడం వల్ల బద్దె పురుగు ఎక్కువవుతుందని తేల్చారు. అందుకే అడవి పంది మాంసం తినే వారు జాగ్రత్తలు పాటించాల్సిందే. వారితో ఉండేవారు కూడా అప్రమత్తంగా ఉంటేనే సరి. లేకపోతే ఇది అంటు వ్యాధిగా మారుతుందంటున్నారు. అందుకే మాంసాహారులు శుభ్రతకు పెద్దపీట వేయాల్సిందే అంటున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. శుభ్రంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరంతరం మన చేతులు శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే మన శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్లకుండా ఉంటుంది. బద్దెపురుగును నివారించే క్రమంలో మన శరీరానికి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.