ఈ వైరస్ తో జాగ్రత్త!
సీజన్ మారిపోయింది. వర్షాకాలం ముగిసింది.. శీతాకలం ఎంటరైపోయ్యింది! ఈ సమయంలో సీజనల్ ఫీవర్స్ వాటి పని అవి చేస్తున్నాయని అంటున్నారు
సీజన్ మారిపోయింది. వర్షాకాలం ముగిసింది.. శీతాకలం ఎంటరైపోయ్యింది! ఈ సమయంలో సీజనల్ ఫీవర్స్ వాటి పని అవి చేస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో పగలంతా విపరీతమైన వేడి, రాత్రైతే చల్లని వాతావరణం. దీంతో వైరల్ వ్యాధులు విభృంభిస్తున్నాయి. ఇందులో భాగంగా... పలు ప్రాంతాల్లో ఇన్‌ఫ్లూయెంజా ఏ, బీ వైరస్ లు దాడిచేస్తున్నాయి. ఈ సమయంలో ఇన్ ఫ్లూయెంజా వైర బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ వైరస్ సోకితే కనిపించే లక్షణాలు మొదలైన విషయాలను వైద్యులు చెబుతున్నారు.
అవును... పగలు విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. రాత్రైతే మంచు కురుస్తూ చల్లని వాతావరణం ఉంటుంది. అడపాదడపా అప్పుడప్పుడూ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇన్ ఫ్లూయెంజా ఏ, బీ వైరస్ లు దాడిచేస్తున్నాయి. మరోపక్క స్వైన్ ఫ్లూ కేసులు సైతం పెరుగుతున్నాయి. దీంతో... తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
దీంతో... ఓపీలో వంద మంది వస్తే.. అందులో సగం మందికి ఇవే లక్షణాలుంటున్నాయని నగరంలోని ఆసుప్త్రులు చెబుతున్నాయని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఈ ఇన్ ఫ్లూయెంజా ఏ, బీ వైరస్ ల విషయమంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ లో ఇబ్బందిపెట్టిన ఒమిక్రాన్ లో కూడా ఇవే తరహా లక్షణాలుంటాయని వైద్యులు చెబుతుండటం గమనార్హం. అయితే వీరిలో 5 శాతం మందిలో మాత్రం న్యుమోనియాకు దారి తీస్తోందని వైద్యులు చెబుతున్నారు.
ఈ వైరస్ సోకిన బాధితుల్లో రెండు, మూడు రోజులు తీవ్ర జ్వరం, దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్న వైద్యులు... జ్వరం తగ్గుతున్నప్పటికీ ఆయాసం, దగ్గు మాత్రం చాలా రోజులు వేధిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ పరీక్షల్లో మాత్రం నెగెటివ్ కనిపిస్తోందని అంటున్నారు వైద్యులు. చెస్ట్ ఎక్స్ రే, సీటీ స్కాన్ లలో కూడా ఇబ్బందులు కనిపించడం లేదని అంటున్నారు.
ఈ వైరస్ సోకినవారిలో హఠాత్తుగా జ్వరం రావడం, పొడిదగ్గు, తలనొప్పి, గొంతు మంట, ముక్కు కారడడం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, తీవ్రమైన నీరసం, అలసట వంటివి సాధారణ లక్షణాలుగా ఉండటంతోపాటు.. ఈ దగ్గు మత్రం రెండువారాలు అంతకంటే ఎక్కువ రోజులే కొనసాగుతుందని అంటున్నారు.
ఈ సమయంలో, ప్రస్తుత పరిస్థితుల్లో గుంపుల్లోకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం, తరచూ చేతి శుభ్రత పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అదేవిదంగా... ఈ వైరస్ సోకినవారికి మిగతా కుటుంబ సభ్యులు దూరం పాటించాలని చెబుతున్నారు. మరోపక్క శిశువులు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాదులున్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, స్టెరాయిడ్లు తీసుకుంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.