'పనస' ప్రయోజనాలు ఎన్నో !

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి. పండిన పనస తొనల్లో రుచి మాత్త్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

Update: 2024-05-19 13:30 GMT

వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి. పండిన పనస తొనల్లో రుచి మాత్త్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . ఇతర పండ్లతో పోలిస్తే విటమిన్లు, ఫోలేట్, నియాన్ , పొటాషియం , మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.. దీంట్లో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి మలబద్దకాన్ని నిరోధిస్తుంది.

పనసపండు అల్సర్ , మధుమేహం, గుండెపోటు, రక్తపోటు తదితర సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే సి విటమిన్ చర్మం, శిరోజాలను కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఖనిజాలు, లవణాలు, థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించటమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది.

ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఫుడ్ అలర్జీ ఉన్నవారు పనస పండుకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News