మోకాళ్ల నొప్పులా .. ఈ నూనెలు ట్రై చేయండి !

మోకాళ్లు నొప్పులు. ఇది ఒకప్పుడు ముసలివాళ్ల సమస్య. కానీ మారిన ఆహారపు అలవాట్ల మూలంగా ఏ వయసు వారికి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి

Update: 2024-07-14 09:30 GMT

మోకాళ్లు నొప్పులు. ఇది ఒకప్పుడు ముసలివాళ్ల సమస్య. కానీ మారిన ఆహారపు అలవాట్ల మూలంగా ఏ వయసు వారికి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. ఈ నొప్పులు భరించలేక పెయిన్ కిల్లర్స్ అలవాటు చేసుకోవడం మూలంగా అవి శరీరంలోని కిడ్నీలు, జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపించి ఆరోగ్యం క్షీణించేలా చేస్తున్నాయి. అందుకే ఆయుర్వేదంలో ఉన్న కొన్ని నూనెలు ఉపయోగించడం ద్వారా మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

నువ్వుల నూనెలో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల పటిష్టతకు తోడ్పడతాయి. అందుకే మోకాళ్లకు ఈ నూనెతో మర్దన చేయడం మూలంగా మోకాళ్ల నొప్పుల నుండి ఉప శమనం పొందవచ్చు. దీంతో పాటు ఆవాల నూనెతో మర్దనం చేయడం మూలంగా కూడా మంచి ప్రభావం చూయించే అవకాశం ఉంది. ఆవాల నూనెలో కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసి దానిని వేడి చేసిన తర్వాత మసాజ్ చేసుకుంటే ఫలితాలు ఉంటాయి.

ఆలివ్ ఆయిల్ శరీరంలో రక్తప్రసరణకు ఎంతో ఉపయోగపడుతుంది. మోకాలి నొప్పులు ఉన్నవారు ఈ నూనెతో మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఇక మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి రోజూ యూకలిప్టస్ నూనెతో మసాజ్ చేసుకోవడం కూడా ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండే ఆముదం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది. గోరువెచ్చని ఆముదాన్ని నొప్పులు ఉన్న చోట రుద్దుకుంటే కొద్దిరోజుల్లో ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

Tags:    

Similar News