మెడికోలకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్... టాస్క్ ఫోర్స్ సర్వేలో సంచలన విషయాలు!

అవును... దేశంలోని ప్రతి నలుగురు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు!

Update: 2024-08-17 13:30 GMT

వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యునికి ఈ సమాజం ఇచ్చే గౌరవానికి ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదు. అయితే ఆ తెల్లకోటు వెనుక ఓ నల్లని మానసిక వ్యథ ఉందనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు దేశపు అత్యున్నత వైద్య విద్య నియంత్రణ మండలి నియమించిన టాస్క్ ఫోర్స్ చేసిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

అవును... దేశంలోని ప్రతి నలుగురు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు! అంటే... దేశంలో ఉన్న మెడికల్ స్టూడెంట్స్ లో పాతిక శాతం మందిని ఏదో ఒక మానసిక సమస్య వెంటాడుతోందన్నమాట. ఇక మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థుల్లోని ప్రతీ ముగ్గురిలో ఒకరు ఆత్మహత్య చెసుకోవాలనే ఆలోచనతో ఉన్నారనే షాకింగ్ విషయాలు తెరపైకి వచ్చాయి.

అంటే.. 31.23 శాంతంమందిలో సూసైడ్ టెండెన్సీ కనిపిస్తోందని.. ఈ మేరకు గత ఏడాది కాలంలో సుమారు 4.4 శాతంమంది (237) పీజీ మెడికోలు ఆత్మహత్యా యత్నం చేశారని చెబుతున్నారు. ఇక ఎంబీబీఎస్ చదువుతున్న వారిలో 10.5 శాతం (564) మంది విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారని అంటున్నారు. తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ చేసిన ఆన్ లైన్ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.

దింతో ఈ మెడికోలు రేపటి రోజున వైద్యులు అయ్యాక వాళ్లపై ఈ సమస్యలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. పైగా... ఈ మెడికోలు తమ మానసిక సమస్యలు బయటకు చెప్పుకోవడానికి, చికిత్స చేయించుకొవడానికి ఇష్టపడటం లేదని అంటున్నారు. దీంతో.. ఇది మరింత ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా 25,590 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్.. 5,337 మంది పీజీ స్టూడెంట్స్ తో పాటు 7,035 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ తో నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశ అత్యున్నత వైద్య విద్యా నియంత్రణ మండలి నియమించిన టాస్క్ ఫోర్స్ ఈ సర్వే చేపట్టింది. ఈ సంఅర్భంగా మానసిక సమస్యల నుంచి మెడికోలను కాపాడేందుకు పలు చర్యలను సిఫార్స్ చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News