పురుషుల వీర్యంపై 'ప్లాస్టిక్' ప్రభావం.. ఎంత ప్రమాదమంటే!
ప్లాస్టిక్‌కు.. ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం పెరిగిపోయింది. తెల్లవారి లేచింది మొదలు తాగే నీళ్ల నుంచి వాడే వస్తువుల వరకు
ప్లాస్టిక్‌కు.. ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం పెరిగిపోయింది. తెల్లవారి లేచింది మొదలు తాగే నీళ్ల నుంచి వాడే వస్తువుల వరకు.. అన్నీ ప్లాస్టిక్ తోనే తయారైన వాటిని మనం ఉప యోగిస్తున్నాం. ఒకప్పుడు ఉదయం లేచిన తర్వాత.. రాగి చెంబుల్లో నీటిని తాగేవారు. కానీ, ఇప్పుడు ప్లాస్టిక్ సీసాలనే కరిచి పెట్టుకుని పడుకుంటున్నారు. వాటిలో ఉన్న నీటినే తాగుతున్నారు. ఏది చూసినా ప్లాస్టిక్. కూల్ డ్రింక్స్ నుంచి ఆహార పదార్థాల ప్యాకింగ్ వరకు కూడా ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. !
అంతలా జన జీవితంతో పెనవేసుకుపోయిన ప్లాస్టిక్‌తో అనేక రోగాలు వస్తున్నాయని.. గత దశాబ్ద కాలంగా కూడా సర్వేలు చెబుతున్నాయి. ఊపిరితిత్తుల నుంచి గుండె వరకు కూడా.. రోగాలకు ప్లాస్టిక్ వినియోగం కారణమనే అంచనాలు వచ్చాయి. అయితే. ఇప్పుడు సంతానోత్పత్తిపైనా ప్లాస్టిక్ ప్రభావం చూపుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. మెక్సికో దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో ప్రొఫెసర్ డా. జావ్‌జాంగ్ సారథ్యంలోని పరిశోధకుల బృందం మానవ వృషణాలపై అధ్యయనం చేసింది.
దీనికి కారణం.. ఇటీవల దశాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వీర్య కణాల్లో సంతానోత్పత్తికి సంబంధించిన కణాలు తగ్గుముఖం పట్టి.. పలు దేశాల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుండడమే. దీనిపై అధ్యయనం చేసిన వివరాలను టాక్సికొలాజికల్ సైన్సెస్ అనే జర్నల్‌లో ప్రచురించారు. మొత్తంగా ఈ అధ్యయనంలో కుక్కలు, మనుషుల వృషణాలను పరిశీలించారు. ఆయా వృషణాల్లో `మైక్రోప్లాస్టిక్స్` రేణులను అధ్యయన కర్తలు గుర్తించారు. దీనివల్లే సంతానోత్పత్తిపై ప్రబావం పడుతోందని వెల్లడించారు.
ఇవీ.. సూచనలు..
+ మనం వినియోగించే ప్టాస్టిక్ సీసాల్లో నిల్వ ఉన్న నీరు, ఇతర పదార్థాల్లోకి ప్లాస్టిక్ రేణులు అత్యంత సూ క్ష్మంగా ఉన్నవి చేరిపోయి.. అనంతరం.. మన బాడీలోకి చేరుతున్నాయి. అవి తర్వాత కాలంలో వృషణా ల్లోకి చేరి నిల్వ ఉంటున్నాయి. దీంతో వీర్య పుష్టి తగ్గుతుండడం.. సంతానోత్పత్తి కణాలు తగ్గిస్తున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో పురుషులు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు.
+ ఇదే సమయంలో రాగి పాత్రల వినియోగంపైనా అధ్యయనం చేశారు. రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేసుకుని తీసుకునే వారిలో వీర్య కణాల వృద్ది పెరిగినట్టు గుర్తించారు. దీనిని బట్టి రాగి పాత్రలు, లేదా మట్టి పాత్రలను వినియోగించాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం జపాన్, జర్మనీ వంటివి రాగి, పింగాణీ పాత్రలపై పన్నులు మినహాయించిన విషయం ఈ సందర్భంగా గుర్తించాల్సిన అంశం.