నందిత శ్వేత లావు అయిపోవడానికి కారణం ఇదే!
తాజాగా నందిత శ్వత కూడా సమంతలాగే తన అనారోగ్య సమస్యని బట్ట బయలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నందిత నాజుకుగా ఉండేది.
హీరోయిన్లు ఇప్పుడన్నీ విషయాల్లో ఎంతో ఓపెన్ గా ఉంటున్నారు. దాపరికాలు లేకుండా ఎలాంటి విషయా న్నైనా పబ్లిక్ చేస్తున్నారు. అభిమానులతో పంచుకుంటున్నారు. ఆ రకంగా కొంత మానసిక బరువును దించు కోల్గుతున్నారు. మనకున్న సమస్యలు చెప్పుకుంటే? ఏమవుతుందోనని భయాలు తొలగించి ధైర్యంగా ముం దుకొస్తు న్నారు. అభిమానుల్లో వచ్చిన అవేర్ నేస్ కూడా ఈ ధైర్యానికి ఓ కారణంగా చెప్పొచ్చు.
సమంత మయోసైటిస్ వ్యాధిబారిన పడిన సమయంలో అభిమానులకు ఆమెకు ఎంతో అండగా నిలబడ్డా రు. త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని అంతా ఆకాక్షించారు. అభిమానులు భావించిన ట్లుగానే సామ్ ఇప్పుడు కోలుకుని సినిమాలు చేసుకుంటుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు బయటకు చెప్పడానికి ష్టపడరు. కెరీర్ పై ప్రభావం పడుతుందనో? ఇంకేదైనా జరుగుతుందోనన్న భయంతో రహస్యంగా ఉంచుతారు.
సినిమాల నుంచి నిష్క్రమించిన కొన్నేళ్ల తర్వాత ..అదీ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే లీక్ చేస్తుంటారు. తాజాగా నందిత శ్వత కూడా సమంతలాగే తన అనారోగ్య సమస్యని బట్ట బయలు చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నందిత నాజుకుగా ఉండేది.
ఆ తర్వాత కొన్ని నెలలకే చబ్బీలుక్ లోకి మారిపోయింది. ఒళ్లు చేయడం సహజం కాబట్టి అలాగే వచ్చిందనుకున్నారంతా. కానీ దీని వెనుక ఓ అనారోగ్య సమస్య ఉందన్న విషయాన్ని తాజాగా నంది రివీల్ చేసింది.
నాకు ఫైబ్రోమయోల్జియా అనే కండర రుగ్మత ఉంది. దాని వల్ల ఎక్కువ డైట్ పాటిస్తూ భారీ వ్యాయామాలు చేయడం సాధ్యం కాదు. మితి మీరిన ఒత్తిడి..సరిగ్గా నిద్రలేకపోవడం వంటి కారణాల వల్ల ఇది తీవ్రతరం అవుతుంది. అకారణంగా బరువు పెరిగిపోతాం. మళ్లీ ఒ ఒళ్లు తగ్గించడం సులభమైన పని కాదు.
అలా వదిలేస్తే ఇంకా లావు అయిపోతాం. ఇది వెన్నెముక.. కండరాలకు సంబంధించిన సమస్య. సడెన్ గా నీరసం వచ్చేయడం.. బ్రెయిన్ నొప్పిని గ్రహించలేకపోవడం లాంటివి ఈ రుగ్మత లక్షణాలు. క్రమం తప్పకుండా డైట్ ..వ్యాయామాలు చేస్తేనే మన అధినంలో ఉంటుంది' అని తెలిపింది.