కొత్త స్మార్ట్ రింగ్ చూశారా... ప్రత్యేకతలివే!

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ నాయిస్ తన తొలి స్మార్ట్ రింగ్‌

Update: 2023-07-27 09:18 GMT

స్మార్ట్ ఫోన్స్ నుంచి స్మార్ట్ వాచ్ లు, స్మార్ట్ రిస్ట్ బాండ్ లు వచ్చిన ట్రెండ్ కి మించి ఇప్పుడు స్మార్ట్ రింగ్ భారతమార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది! చేతి వేలికి పెట్టుకునే ఈ రింగ్ లో ఉన్న ఫీచర్స్ పిచ్చెక్కిస్తాయని కామెంట్ చేస్తున్నారు! నాయిస్ సంస్థ ఆవిష్కరించిన ఈ రింగ్ సంగతేమిటో ఇప్పుడు చూద్దాం!

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ నాయిస్ తన తొలి స్మార్ట్ రింగ్‌ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. నాయిస్ లూనా రింగ్ పేరిట తీసుకొస్తున్న ఈ రింగ్‌ లో సూపర్ ఫీచర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో హార్ట్ రేట్ మానిటర్‌, బాడీ టెంపరేచర్ సె న్సర్‌, ఆక్సిజన్‌ లెవల్‌ సెన్సర్‌ వంటి ఫీచర్లున్నాయి.

స్పెసిఫికేషన్స్ విషయనికొస్తే... ఈ రింగ్‌ లో హార్ట్‌ రేట్‌ ను గుర్తించటానికి ఇన్‌ ఫ్రారెడ్ ఫోటోప్లెథిస్మోగ్రఫీ సెన్సర్‌ లు, హార్ట్ బీట్ లో మార్పులను గుర్తించడానికి 3-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, బాడీ టెంపరేచర్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు స్కిన్‌ టెంపరేచర్‌ సెన్సర్‌ వంటి అధునాతన ఫీచర్లున్నాయి.

ఇది బ్లూటూత్ ఆధారంగా పని చేస్తుంది. ఇది ఐఓఎస్‌ 14, ఆండ్రాయిడ్ 6, ఆపై వెర్షన్లు కలిగిన డివైజులకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. ఈ రింగ్‌ పూర్తిగా ఛార్జ్‌ అవ్వటానికి 60 నిమిషాలు పడుతుంది. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే ఏడు రోజులపాటు పనిచేస్తుందని చెబుతున్నారు.

ఇదే క్రమంలో టైటానియం బాడీతో వచ్చే ఈ రింగ్‌ లో వైర్‌ లెస్ ఛార్జింగ్‌ సదుపాయం ఉందని నాయిస్‌ తెలిపింది. సన్‌ లైట్ గోల్డ్‌, రోస్ గోల్డ్‌, స్టార్‌ డస్ట్ సిల్వర్‌, లూనార్ బ్లాక్‌, మిడ్‌ నైట్ బ్లాక్‌ రంగుల్లో, ఏడు సైజుల్లో ఈ రింగ్‌ లభిస్తుంది. అయితే, వీటి అమ్మకాలు భారత్‌ లో ఎప్పుడు మొదలు కానున్నాయనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

ఈ రింగ్ ను ప్రీబుకింగ్‌ చేయాలనుకొనే కస్టమర్లు రూ.2వేలతో ప్రయారిటీ యాక్సెస్‌ పాస్ సాయంతో నాయిస్‌ వెబ్‌ సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ పాస్‌ సాయంతో బుక్ చేసుకున్న వారికి కొనుగోలు సమయంలో రూ.1,000 డిస్కౌంట్‌ తోపాటు రూ.2 వేలు విలువైన బీమా కవరేజీ ఉచితంగా లభిస్తుందని వెల్లడించారు!

Tags:    

Similar News