ఏళ్ళ నాటి నొప్పిని కూడా పారద్రోలే ఈ ప్రాచీన థెరపీ గురించి మీకు తెలుసా?

ప్రస్తుతం హడావిడి జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా ప్రజలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Update: 2024-08-25 14:30 GMT

ప్రస్తుతం హడావిడి జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆరోగ్యపు అలవాట్ల కారణంగా ప్రజలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం పై కూడా అవగాహన బాగా పెరుగుతుంది. స్ట్రెస్ తగ్గించుకొని, ఫిట్ గా ఉండడం కోసం సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడానికి, వ్యాయామాలు చేయడానికి ఎంతోమంది ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే మన ప్రాచీన పద్ధతుల ద్వారా ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అలా ప్రస్తుతం బాగా పాపులర్ అయిన ఒక పురాతనమైన థెరపీ కప్పింగ్ థెరపీ. ఇది వేల సంవత్సరాలుగా ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించబడుతూ వస్తోంది. సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా ఈ థెరపీ యొక్క ప్రయోజనాలను పొందడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ కప్పింగ్ థెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం పదండి..

కప్పింగ్ థెరపీ

ఇది ఒక ప్రాచీనమైన థెరపీ. ఇందులో ఒక రకమైన కప్ ఉపయోగిస్తారు. చికిత్స చేసేవారు థెరపీ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి చర్మంపై కొన్ని నిమిషాల పాటు ఈ ప్రత్యేకమైన కప్స్ ను ఉంచుతారు. ఈ ప్రక్రియలో మన శరీరంలో ఉన్న కణజాలం కప్పులోకి లాగబడుతుంది. తద్వారా ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుగా జరిగి.. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగించబడతాయి. ఈ ప్రక్రియ ద్వారా కండరాల నొప్పి, వాపు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా ఈ ప్రక్రియలో గాజు, వెదురు, మట్టి కుండలు, సిలికాన్ లేదా ప్లాస్టిక్ కప్పులను ఉపయోగిస్తారు.

ఈ థెరపీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరీ ముఖ్యంగా రక్తహీనత,రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఫైబ్రో మలేషియా లాంటి సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే కండరాల నొప్పి, వెన్నునొప్పి, కాళ్ల నొప్పి ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆందోళన, స్ట్రెస్, అధిక రక్తపోటు, మైగ్రేన్, డిప్రెషన్ లాంటి సమస్యలకు కూడా ఈ కప్పింగ్ థెరపీ తీసుకోవచ్చు.

అయితే మీరు ఈ కప్పింగ్ థెరపీ చేసే వ్యక్తికి సరియైన సర్టిఫికేషన్ ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరు పడితే వారి దగ్గర ఇది చేయించుకోవడం వల్ల దుష్ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ థెరపీ చేయించుకోవాలి అంటే ముందుగా మీ డాక్టర్ను సంప్రదించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈ థెరపీ తర్వాత స్కిన్ రాషెస్, ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది.

సోర్స్ :  వైరల్ న్యూస్

Tags:    

Similar News