ఎక్సర్ సైజ్ పిల్ వచ్చేసింది... కండిషన్స్ అప్లై!
ఇక ప్రధానంగా.. పట్టణాల్లో ఉండేవారి పరిస్థితైతే వ్యక్తిగత ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేని పరిస్థితి అని అంటారు.
ప్రస్తుత రోజుల్లో పని ఒత్తిడి, జంక్ ఫుడ్, నిద్రలేమి, ఫలితంగా పెరుగుతున్న శరీరం బరువు, తద్వారా వచ్చే ఎన్నో రకాల సమస్యలు.. వెరసి రోగాలతో సహవాసం చేయాల్సిన పరిష్తితి అనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధానంగా.. పట్టణాల్లో ఉండేవారి పరిస్థితైతే వ్యక్తిగత ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ పెట్టలేని పరిస్థితి అని అంటారు.
దీంతో అవకాశం లేక కొంతమంది వ్యాయామం చేయలేకపోతే... బద్దకించి మరికొంతమంది జిమ్ వైపు చూడలేని పరిస్థితి. ఈ క్రమంలో ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించేవారు చుట్టూ పెరిగిపోతుంటారు. ఈ సమయంలో కనీసం వాకింగ్ చేద్దామన్నా సాధ్యంకాని బిజీ షెడ్యూల్!
ఫలితంగా... ఒకప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు.. చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. అయితే... ఈ సమస్యకు ఒక టాబ్లెట్ తో పరిష్కారం చూపించబోతున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఒక పిల్ వేసుకుంటే ఇక జిమ్ కు వెళ్లకపోయినా పర్లేదని చెబుతున్నారు. ఆ ట్యాబ్లెట్ కి "లేక్" అని నామకరణం చేశారు.
అవును... ఏ పనీ చేయకుండా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని అంటుంటారు పెద్దలు. అయితే... కష్టపడకుండా కూర్చుంటే మాత్రం ఒంట్లో కొవ్వు కరగదు అనేది అంతా చెప్పే మాట! కచ్చితంగా వ్యాయామం చేయాలి.. చక్కని ఆహార నియామాలు పాటించాయి.. అప్పుడు కానీ పలు అనారోగ్య సమస్యలకు కారణమయ్యే బరువు తగ్గదు!
అయితే ఇది పాత మాట అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆహారానికి ప్రత్యామ్నాయంగా కొన్ని మాత్రలు వచ్చినట్టుగా.. ఇప్పుడు ఎక్సర్ సైజ్ అవసరం లేకుండా అదే స్థాయి ఫలితాన్ని అందించే పిల్స్ ని కనిపెట్టారు. ఈ ఒక్క మాత్ర వేసుకుంటే.. పది కిలోమీటర్లు పరుగు పెట్టేటంత ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.
డెన్మార్క్ లోని ఆరూస్ యూనివర్శిటీ పరిశొధకులు తాజాగా ఓ ట్యాబ్లెట్ ను ఆవిష్కరించారు. వీటికి "లేక్" అని నామకరణం చేశారు. మనం బాగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో కీటోన్స్, లాక్టేట్ ఏర్పడి.. అవి ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను నియంత్రిస్తాయి. అయితే.. ఈ లేక్ మాత్ర ఆ పరిణామాన్నే కృత్రిమంగా కలిగిస్తుందనమాట!
అందువల్లే... లాక్టేట్, కీటోన్స్ లలోని తొలి అక్షరాలను తీసుకొని దీనికి "లేక్" అని పేరు పెట్టారు. అయితే ఇక్కడొక కండిషన్ ఉందని చెబుతునారు. ఇందులో భాగంగా.. వ్యాయామం చేయగలిగి ఉండి కూడా చేయలేని వారికోసం ఈ పిల్ కాదు. నరాలు, మెదడు, గుండె జబ్బులతో బాధపడుతూ వ్యాయామాలు చేయలేనివారి కోసమని అంటున్నారు శాస్త్రవేత్తలు!