డెంగ్యూ వైరస్ ద్వారా ప్లాస్మా లీకేజీ.. తస్మాత్ జాగ్రత్త..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ మహమ్మారి మెల్లగా వ్యాపిస్తుంది.

Update: 2024-08-28 12:30 GMT

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డెంగ్యూ మహమ్మారి మెల్లగా వ్యాపిస్తుంది. సాధారణంగా డెంగ్యూ దోమ కుట్టినప్పుడు జ్వరం వస్తుంది అన్న విషయం మాత్రమే మనకు తెలుసు కానీ దీని ప్రభావం వల్ల ప్లాస్మా లీకేజ్ కూడా అవుతుంది అంటున్నారు నిపుణులు.డెంగ్యూ వైరస్‌ కారణంగా మన రక్తనాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు ఏర్పడుతుంది. దీంతో రక్తంలోని ప్లాస్మా లీక్ అయ్యే అవకాశం ఉంది.

డెంగ్యూ వ్యాధిగ్రస్తులలో చాలావరకు ప్లాస్మా లీకేజీ కారణం వల్ల సీరియస్ అయిన వారు ఉన్నారు.కాళ్ల వాపు,రక్తంలో హెమటోక్రిట్‌ స్థాయిలు పెరగడం, పల్స్, బీపీ ఫ్లక్చువల్ అవ్వడం లాంటి లక్షణాలు ప్లాక్స్మా లీకేజ్ కారణంగా సంభవిస్తాయి.వాంతులు, కడుపు నొప్పి, కళ్ళు వాయడం లాంటి లక్షణాలు కనిపిస్తే ప్లాస్మా లీకేజ్ జరిగింది అని భావించి అప్రమత్తం కావాలని వైద్యులు చెపుతున్నారు.

టైగర్‌ దోమ కుట్టిన 4-5 రోజులకు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా హై ఫీవర్, ఒంటి నొప్పులు, దద్దర్లు, కళ్ల వాపు..నొప్పి లాంటి లక్షణాలు ఈ వ్యాధి సోకిన వారిలో చూడవచ్చు. వచ్చిన ప్రతి జ్వరం డెంగ్యూ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిదే కదా. అందుకే మీకు జ్వరం వచ్చి మూడు రోజులపాటు తగ్గకుండా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ పరీక్షల్లో డెంగ్యూ జ్వరం నిర్ధారణ అయితే తప్పకుండా తగిన చికిత్స తీసుకోవాలి.

డెంగ్యూ వ్యాధి సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉంటూ ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గకుండా చూసుకుంటూ సరియైన ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాధిని అరికట్టవచ్చు. జ్వరం తగ్గిన తర్వాత కూడా కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి బాడీ నాచురల్ కూలర్స్ తాగుతూ ఉండాలి.

డెంగ్యూ వచ్చిన వారిలో కేవలం 10 శాతం మందిలో మాత్రమే ఈ ప్లాస్మా లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. అటువంటి లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాతావరణం లో ఏర్పడిన మార్పుల కారణంగా డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మన వంతు జాగ్రత్తలు మనం కూడా పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు ఎక్కువగా లేకుండా చూసుకోవడం మంచిది.

Tags:    

Similar News