అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్
ఆ సమయంలోనే ఫెబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధి పూనమ్ కి ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందట.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన పూనమ్ కౌర్ గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఈమె చేసే సందడి కారణంగా సినిమాల్లో నటించకున్నా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.
గత కొన్నాళ్లుగా పూనమ్ కౌర్ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుందట. 2022 లో వెన్ను నొప్పి రావడంతో కేరళ ఆయుర్వేద చికిత్స తీసుకుందట. ఆ సమయంలోనే ఫెబ్రోమైయాల్జియా అనే అరుదైన వ్యాధి పూనమ్ కి ఉన్నట్లుగా నిర్థారణ అయ్యిందట. తాజాగా ఒక కార్యక్రమం సందర్భంగా పూనమ్ ఈ విషయాన్ని తెలియజేసింది.
2022 నుంచి కూడా పూని ఆ అరుదైన వ్యాధికి సంబంధించిన ట్రీట్‌మెంట్ ను కేరళలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో తీసుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి పరిష్కారం నిమిత్తం డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని కలిసినట్లుగా ఆమె పేర్కొంది.
ఒక మంచి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ ద్వారా పూనమ్ పేర్కొంది. తన వ్యాధికి సంబంధించిన విషయాలను మంతెన గారి ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది.
ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి ఉన్న వారు తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంతే కాకుండా బాడీ మొత్తం పెయిన్స్ ఉంటాయి. డిప్రెషన్ తో ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వ్యాధిగ్రస్తులు టైట్ డ్రెస్ లు ధరించడం సాధ్యం కాదు. ఎప్పటికీ లూజ్ డ్రెస్ లను మాత్రమే ధరించాల్సి ఉంటుందట. త్వరలోనే ఈ వ్యాధి నుంచి బయట పడుతాను అనే నమ్మకంతో పూనమ్ కౌర్ ఉందట.