ముసలితనం ఈ ఆరింట వల్ల త్వరగా వచ్చేస్తుందట..!

ప్రతీవ్యక్తి తన జీవితంలో నిత్యం యవ్వనంగా ఉండాలని తలచుకుంటాడు. కానీ.. లైఫ్‌లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేది సహజం.

Update: 2024-09-07 19:30 GMT

ప్రతీవ్యక్తి తన జీవితంలో నిత్యం యవ్వనంగా ఉండాలని తలచుకుంటాడు. కానీ.. లైఫ్‌లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనేది సహజం. తమ అందాన్ని కాపాడుకునేందుకు రకరకాల క్రీములు వాడుతుంటారు. ఫేషియల్స్, ఎక్సర్‌సైజులు అంటూ అలవాటు పడిపోతుంటారు. కానీ.. వృద్ధాప్యానికి గల కారణాలను మాత్రం ఎక్కడా వెతకరు.

వృద్ధాప్యం అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు. అది ప్రకృతి విరుద్ధం కూడా. సహజంగా శరీరంలో మార్పులు వస్తాయి. కొందరు తమ శరీరాలు, జన్యునిటీ పరంగా వారిలో తొరగా వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా వృద్ధాప్యంలోకి నెట్టివేయబడుతారు.

అయితే.. సహజంగా వృద్ధాప్యం రావడం ఒక కారణమైతే.. మన కొన్ని అలవాట్ల ద్వారా కూడా ఆ వృద్ధాప్యం దరిచేరుతుంటుంది. వాటి గురించి భారత అమెరికన్ వైద్యుడు సౌరభ్ సేథీ పలు విషయాలు వెల్లడించాడు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.

ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి మద్యం, ధూమపానం అలవాటు ఉంది. వాటి వల్ల కూడా వృద్ధాప్యం వస్తుందని వైద్యుడు వివరించారు. మద్యపానం, ధూమపానంతోపాటు సూర్యుడి యువ కిరణాలకు గురవ్వడం, తరచూ డీహైడ్రేషన్‌కు లోనవ్వడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం, చక్కెర పదార్థాల్ని తినడం వల్ల వృద్ధాప్యం తొరగా వస్తుందని డాక్టర్ చెప్పారు.

Tags:    

Similar News