హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్.. గుండెలు పిండే దృశ్యం
సునైన అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు.
తమిళ్ మరియు తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సునైన. ఈ అమ్మడు మొన్నటి వరకు బాగానే ఉంది... షూటింగ్స్ లో కూడా పాల్గొంది. ఇంతలో ఏమైందో చాలా రోజులుగా జబ్బు చేసినట్లుగా ప్రస్తుతం హాస్పిటల్ లో లేవలేని పరిస్థితుల్లో ఉంది. చేతికి సెలైన్ తో పాటు ముక్కు వద్ద ఆక్సిజన్ పైపు ను ఏర్పాటు చేయడం చూస్తే ఈ అమ్మడికి తీవ్ర అనారోగ్య సమస్య అయ్యి ఉంటుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సునైన నిజంగానే తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధ పడుతుందట. మొదట నార్మల్ జ్వరంగా సునైన లైట్ తీసుకుని ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అవుతుందని భావించిందట. కానీ సునైన కి వైరల్ ఫీవర్ తో పాటు ఫ్లూ కూడా ఉన్నట్లుగా బ్లడ్ టెస్ట్ లో రావడంతో వెంటనే వైద్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాల్సిందే అంటూ సూచించారట. దాంతో సునైన ఆసుపత్రిలో జాయిన్ అయింది.
ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని... అయితే మరో రెండు మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండవలసి రావచ్చు అన్నట్లుగా ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా సునైన తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించింది. వైరల్ ఫీవర్ కారణంగా ఆసుపత్రిలో ఉన్నట్లుగా చేతికి ఉన్న సెలైన్ పైప్ తోనే బాగున్నట్లుగా చెప్పకనే చెబుతోంది.
సునైన అభిమానులు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గెట్ వెల్ సూన్ అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. అందమైన సునైన ను ఇలా చూస్తూ ఉంటే గుండెలు తరుక్కు పోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ సునైన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆమె కోలుకుని మళ్లీ తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశిద్దాం.