బుల్లెట్ దిగినా బ్లడ్ బంద్ అవ్వాల్సిందే... ఏమిటీ జెల్?

ఎవరికైనా కత్తి పోటు దిగినా, బుల్లెట్ దూసుకుపోయినా విపరీతమైన రక్తస్రావం అవుతుంది.. అనంతరం ప్రాణం పోతుందనే సంగతి తెలిసిందే

Update: 2024-08-20 16:30 GMT

ఎవరికైనా కత్తి పోటు దిగినా, బుల్లెట్ దూసుకుపోయినా విపరీతమైన రక్తస్రావం అవుతుంది.. అనంతరం ప్రాణం పోతుందనే సంగతి తెలిసిందే. ఇలా ప్రాణాంతక రక్తస్రావాన్ని నిరోధించే మొట్టమొదటి జెల్ ఆధారిత చికిత్స అయిన "ట్రామా జెల్" మార్కెట్ లోకి పంపించేందుకు క్లియర్ చేయబడింది.

అవును... ప్రాణాంతక రక్తస్రావాన్ని నిరోధించే "ట్రామా జెల్" కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ప్రాణాంతకమైన తుపాకీ, కత్తిపోట్ల వంటి గాయాలపై ఇది క్షణాల్లో పనిచేస్తుంది. రక్తం కారుతున్న చోట ఈ జెల్ ను సిరంజీతో అప్లై చేస్తే.. సెక్షన్లో ఎంతటి రక్తస్రావాన్నైనా ఇది కంట్రోల్ చేస్తుంది.

ఈ సందర్భంగా స్పందించిన ఈ ఔషధ తయారీదారు క్రెసిలాన్... ట్రామాజెల్ 510 (కే) కు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్స్ ఇచ్చిందని, మార్కెట్ చేయగల సామర్థ్యాన్ని మంజూరు చేసిందని ప్రకటించింది. అత్యవసర వైద్య సేవల వ్యవస్థలు, యూఎస్ మిలటరీ, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, ఇతర వైద్య నిపుణుల కోసం త్వరిత, సమర్థవంతమైన పరిష్కారంగా ఇది అభివృద్ధి చేయబడిందని తెలిపింది.

ట్రామాజెల్ ఎలా పనిచేస్తుంది..?

ట్రామా జెల్ అనేది మొట్టమొదటి జెల్ ఆధారిత హెమోస్టాటి ఏజెంట్. ఇది సిరంజి ద్వారా రక్తస్రావానికి కారణమైన గాయంలోకి చిప్పించబడిన హమ్మూస్ లాంటి జెల్. ఇది సిరంజి ద్వారా పంపబడిన తర్వాత.. రోగి రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి ఉపయోగపడుతుంది.

ఇదే సమయంలో కొన్ని సందర్భాల్లో ఇది గాయాలను ప్యాక్ చేయవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇదే సమయంలో.. ఇది చాలా వేగవంతమైన ఫలితాలను పొందడానికి అనుమతిస్తుంది. అమెరికన్ రెడ్ క్రాస్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40% మరణాలు గాయం సంబంధిత రక్తస్రావం కారణంగా సంభవిస్తాయి.

దీంతో... ఇలాంటి పరిస్థితుల్లో ట్రామాజెల్ వంటి సమర్థవంతమైన ఔషదం యొక్క అవసరాన్ని హైలెట్ చేస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News