వ‌యాగ్రా.. అసలు మేలు వేరే ఉంద‌ట‌!!

వ‌యాగ్రా.. ఈ మాట అనేందుకు.. వినేందుకు.. భారతీయ కుటుంబాల్లో కొంత జంకు! ఎందుకంటే

Update: 2024-06-13 23:30 GMT

వ‌యాగ్రా.. ఈ మాట అనేందుకు.. వినేందుకు.. భారతీయ కుటుంబాల్లో కొంత జంకు! ఎందుకంటే.. సెక్స్ ప్రేర‌ణ‌ల‌ను కొన్ని గంట‌ల పాటు నిలిపి ఉంచడ‌మే ఈ టాబ్లెట్ ల‌క్ష్యం. దీంతో వ‌యాగ్రా అన‌గానే అంద‌రి ఆలోచ‌నా.. మ‌న‌సు కూడా.. వెంట‌నే సెక్స్‌పైకి వెళ్లిపోతుంది. దీంతో న‌లుగురిలో ఉన్న స‌మ‌యంలో ఈ టాబ్లెట్ పేరు ఎత్తేందుకు కూడా.. చాలా మంది సంకోచిస్తూ ఉంటారు. అయితే.. తాజాగా జ‌రిగిన అధ్య‌య‌నం, ప‌రిశోధ‌న‌లో వ‌యాగ్రా కేవ‌లం సెక్స్ కోరిక‌ల ప‌రిపుష్టికే కాదని తేలింది. దీనిలో ఉన్న ఔష‌ధం తాలూకు మేళ్లు మ‌రిన్ని ఉన్నాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

1) జ్ఞాప‌క శ‌క్తి: వ‌యాగ్రా ఔష‌ధం.. కేవ‌లం సెక్స్‌కే కాకుండా.. వ్య‌క్తుల్లో ఇటీవ‌ల ప్ర‌బ‌లుతున్న జ్ఞాప‌క‌శ‌క్తి క్షీణ‌త‌ను కూడా త‌గ్గించే ల‌క్ష‌ణం ఉంద‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు. జ్ఞాప‌క శ‌క్తిని లోపించే క‌ణాల‌పై ఇది ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని.. త‌ద్వారా.. వ్య‌క్తుల‌కు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని వారు చెబుతున్నారు.

2) నాడీ సంబంధిత స‌మ‌స్య‌లు: ప్ర‌స్తుతం నాడీ సంబంధిత స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. వ‌ర్క్ ప్రెజ‌ర్‌, కూర్చుని ప‌నిచేసే అల‌వాటు పెరిగిపోవ‌డం.. విశ్రాంతి లేని జీవితం,.. ఒత్తిళ్లు, ప‌నివేళ‌లు కార‌ణంగా నాడీ వ్య‌వ‌స్థ‌ల్లో లోపాలు పెరుగుతున్నాయ‌ని ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఆందోళ‌న పెరిగిపోయిం ది. తాజాగా జ‌రిగిన అధ్య‌య‌నంలో 2030 నాటికి ప్ర‌పంచంలోని 30 శాతం జ‌నాభా నాడీ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతుంద‌ని తేలింది. ఈ క్ర‌మంలో వ‌యాగ్రా పై అధ్య‌య‌నం చేసిన ప‌రిశోధ‌కులు.. నాడీసంబంధిత లోపాల‌ను స‌రిదిద్దే ల‌క్ష‌ణం కూడా.. వ‌యాగ్రాకు ఉంద‌ని తేల్చి చెప్పారు.

ఎలా ప‌నిచేస్తుంది?

వ‌యాగ్రా ఔష‌ధం సెక్స్ విష‌యంలో దూకుడు గా ప‌నిచేసిన‌ట్టుగానే మెద‌డుకు ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రిగే విష‌యంలోనూ.. వేగంగా ప‌నిచేస్తుంద‌ని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టుల బృందం తెలిపింది. వయాగ్రా టాబ్లెట్ వేసుకున్న వ్యక్తికి అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించినపుడు ఈ విషయం బయటపడిందని సైంటిస్టులు చెప్పారు. రక్తప్రసరణ పెరగడం వల్ల మెదడు పనితీరు కూడా ఎరిగిన‌ట్టు గుర్తించారు. సిలాస్టజోల్ తో పోలిస్తే సిల్డెనఫిల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని వివరించారు. మొత్తానికి వ‌యాగ్రా విష‌యంలో ఈ విష‌యాలు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు చ‌ర్చ‌కు రావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News