షివరింగ్ వీడియో... మద్యానికి బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా?
ఈ క్రమంలో ఈ మద్యానికి బానిసైన చాలా వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ జీవితం నాశనం అయిన సంఘటనలు ఎన్నో దర్శనమిస్తుంటాయి.
మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమనే విషయం అది తాగే అందరికీ తెలిసిందే! పైగా ఆ మద్యం బాటిల్ పైనే "మద్యపానం ఆరోగ్యానికి హానికరం" అని స్పష్టంగా ఉంటుంది కూడా! అయితే.. ఎమ్మార్పీలు తెలిసినవే కావడంతో ఆ బాటిల్ పై ఉన్న స్టిక్కర్ లను చాలా మంది చూడరనే కామెంట్లూ వినిపిస్తుంటాయి సరదాగా! ఇక, మద్యపానం శృతిమించితే మనిషి ప్రాణాలకు కూడా ప్రమాదం అని వైద్యులు చెబుతుంటారు.
ఈ క్రమంలో ఈ మద్యానికి బానిసైన చాలా వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ జీవితం నాశనం అయిన సంఘటనలు ఎన్నో దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కసారి మద్యానికి బానిపైపోతే మనిషి చివరికి ఎలాంటి స్థితికి దిగజారి పోతాడో తెలిపే వీడియో ఒకటి తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమయానికి మద్యం అందక ఒక వ్యక్తి వణికిపోతున్న ఒక వ్యక్తి... ఓ పెగ్గు పడిన తర్వాత కాస్త కూల్ అవ్వడం వీడియోలో కనిపించింది!
వాస్తవానికి మద్యం తాగిన తర్వాత మనిషి నరాల్లో కొత్త ఉత్సాహం వస్తుంది. దీంతో అది క్రమేపీ నరాలకు కూడా అలవాటు పడతాదని చెబుతున్నారు. ఆ నాలుగు చుక్కలు పడితే తప్ప ఆ ఉత్సాహం రాని స్థాయిలో శరీరం అలవాటు పడిపోతుందని అంటున్నారు. ఈ క్రమంలో చివరికి అదొక ఎడిక్షన్ లా మారిపోతోందన్నమాట. అంటే మద్యం గొంతులో పడకపొతే నిలవలేని పరిస్థితి దాపురిస్తుందని చెప్పొచ్చు!
దీనినే... ఆల్కహాల్ విత్డ్రావల్ అంటారు! ఈ స్థాయి మరింత ముదిరితే అది ఫిట్స్ కు దారితీయడం చేస్తుందని.. కొన్ని సందర్భాల్లో మతి భ్రమించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ స్టేజ్ కూడా దాటిపోతే అది చివరికి ప్రాణం పోయేలా కూడా మారొచ్చని అంటున్నారు. తాజాగా ఈ వీడియోలో ఉన్న వ్యక్తికి జరుగుతోంది అదే!
ఇందులో భాగంగా... మద్యానికి అలవాడు పడిన వ్యక్తి సమయానికి ఆ డ్రాప్స్ పడకపోవడంతో స్థిమితంగా ఉండలేకపోయాడు.. నరాలు షివరింగ్ అయిపోవడం మొదలుపెట్టాయి. ఈ సమయంలో రెండు పెగ్గుల మందు పడగానే నరాలు కాస్త కుదుటపడ్డాయి. దీంతో... ఈ స్థాయి అంతిమంగా మరణానికి దారితీస్తుందని అంటున్నరంట వైద్య నిపుణులు!