72ఏళ్లుగా ఇనుప కవచంలోనే... పోలియో పాల్ మృతి!
అవును... ఆరేళ్ల వయసులోనే పోలియో బారిన పడి.. మెడ నుంచి అరికాలి వరకూ నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినడంతో.. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు పాల్ అలేగ్జాండర్.
పోలియో పాల్ అని పిలవబడే పాల్ అలెగ్జాండర్ (78) కన్నుమూశారు. సుమారు గత 72 ఏళ్లుగా ఇనుప ఊపిరితిత్తులతో జీవనం సాగిస్తున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్! పూర్తిగా ఐరన్ లంగ్స్ మిషన్ ద్వారా ఇన్నేళ్ల పాటు జీవనం సాగించడం ఆయన ప్రత్యేకత. దీంతో ప్రపంచ మొత్తం ఆయన మృతిపట్ల ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తుంది. నెట్టింట ఈయన గురించిన సెర్చ్ వైరల్ గా మారింది.
అవును... ఆరేళ్ల వయసులోనే పోలియో బారిన పడి.. మెడ నుంచి అరికాలి వరకూ నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతినడంతో.. చివరకు శ్వాస కూడా స్వయంగా తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు పాల్ అలేగ్జాండర్. దీంతో... సుమారు 600 మిలియన్ పౌండ్ల విలువైన యంత్రం సహాయంతొ ఆయన శ్వాస తీసుకుంటున్నారు.. అలా శ్వాస తీసుకుంటూనే ఇంతకాలం జీవించారు.
వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ కు చెందిన అలెగ్జాండర్ పాల్ 1946లో జన్మించారు. ఈ క్రమంలో ఆయనకు ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు.. అంటే 1952లో అతడి మెడ నుంచి కింది భాగం మొత్తం పనిచేయకుండా పోయింది.
ఈ సమయంలో అతడిని టెక్సాస్ లోని ఆస్పత్రికి తరలించగా... ఇకపై ఇతడు స్వయంగా శ్వాసకూడా తీసుకోలేడని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో అతడి కోసం ఒక యంత్రాన్ని అమర్చారు.
ఇందులో భాగంగా... అతడికి కృత్రిమంగా ఊపిరి అందేలా ఒక భారీ యంత్రాన్ని ఆయనకు పెట్టారు. సుమారు 270కిలోల బరువుండి, ఒక భారీ పెట్టేలా కనిపించే ఆ యంత్రంతోనే ఆయన ఊపిరి పీల్చుకుంటూ ఇంతకాలం గడిపారు. అలాగే ఆయన న్యాయవిద్యను అభ్యసించడంతోపాటు రచయితగానూ మారాడు.. పలు రచనలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు.