చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్.. ప్రతిచోటా భారతీయులు.. మరి సిరియాలో?
దాదాపు మూడేళ్ల కిందట ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో ఆ దేశంలో భారీగా ఉన్న భారతీయులను హుటాహుటిన తీసుకొచ్చారు.
ఐదేళ్ల కిందట చైనాలో కొవిడ్ వ్యాప్తి మొదలైన సమయంలో వేలాది మంది భారతీయులను అక్కడి నుంచి తరలించారు.. ముఖ్యంగా వీరిలో వైద్య విద్యార్థులు అధికంగా ఉన్నారు.. కొవిడ్ కేంద్ర స్థానంగా భావిస్తున్న వూహాన్ మెడికల్ యూనివర్సిటీ వందల మంది భారత్ కు క్షేమంగా తీసుకొచ్చారు.
దాదాపు మూడేళ్ల కిందట ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన సమయంలో ఆ దేశంలో భారీగా ఉన్న భారతీయులను హుటాహుటిన తీసుకొచ్చారు. వీరిలోనూ అత్యధికులు వైద్య విద్యార్థులే.
14 నెలల కిందట గాజా నుంచి ఇజ్రాయెల్ పై దాడికి దిగారు హమాస్ మిలిటెంట్లు. దీంతో ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది. ఆ దేశం నుంచి వందల మంది భారతీయులను వెనక్కుతీసుకొచ్చారు. గాజాలోనూ ఒక భారతీయుడు ఉన్నట్లు తర్వాత కథనాలు వచ్చాయి. కానీ, అవి నిర్ధారణ కాలేదు.
ఇప్పుడు సిరియా వంతు
తాజాగా మరో పశ్చిమాసియా దేశం సిరియాను హస్తగతం చేసుకున్నాయి తిరుగుబాటు దళాలు. దీంతో అధ్యక్షుడు బషర్-అల్ అసద్ కుటుంబంతో పాటు దేశాన్ని వీడారు. ఈ నేపథ్యంలో
అక్కడున్న భారతీయులను రప్పించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా 75 మంది భారత పౌరులను సిరియా రాజధాని డమాస్కస్ నుంచి లెబనాన్ కు తీసుకొచ్చారు.
వీరిలో 44 మంది కశ్మీర్ కు చెందిన జైరిన్ (యాత్రికులు) అని ప్రభుత్వం తెలిపింది. వాణిజ్య విమానాల్లో లెబనాన్ నుంచి త్వరలోనే ఢిల్లీకి వస్తారని పేర్కొంది.
సిరియాలో భారీగానే భారతీయులు
పశ్చిమాసియా దేశాల్లో కాస్త మంచి పేరున్న సిరియాను అంతర్యుద్ధం బాగా దెబ్బకొట్టింది. దీంతో 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని లక్షల మంది ప్రవాస జీవితం గడుపుతున్నారు. మరోవైపు సిరియాలో ఇంకా అనేకమంది భారతీయులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.