బీజేపీ ఎమ్మెల్యేపై వరుస కేసులు... ఇప్పుడు లైంగిక వేధింపుల వ్యవహరం!

అవును... కర్ణాటకలోని రాజరాజేశ్వరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

Update: 2024-09-19 08:14 GMT

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తోపాటు మరో ఆరుగురిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బుధవారం రాత్రి రాంనగర్ జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్లు 354ఏ, 354సి, 376, 504, 506, 120బి, 149, 384 సెక్షన్స్ కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది!

అవును... కర్ణాటకలోని రాజరాజేశ్వరి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తోపాటు మరో ఆరుగురిపై అభియోగాలు నమోదయ్యాయి! కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఈ ఘటన జరిగిందని అంటున్నారు.

కాగా... కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో మునిరత్న ఇప్పటికే బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో బెయిల్ మంజూరు అయితే.. తాజా లైంగిక ఆరోపణల కేసులో జైలు దగ్గరే నిర్భందించే అవకాశం ఉంది.

ఒకవేల కాంట్రాక్టర్ ను బెదిరించిన కేసులో బెయిల్ తిరస్కరణకు గురైతే.. కగ్గలిపుర పోలీసులు వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారని అంటున్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కాంట్రాక్టర్ ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబరు 14న అదుపులోకి తీసుకున్నారు.

కోలార్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... మునిరత్న ఏపీకి వెళ్తుండగా కోలార్ పోలీసుల సహాయంతో బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో మునిరత్నపై వైయాలికావల్ పోలీస్ స్టేషన్ లోనూ రెండు ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని అంటున్నారు. కాంట్రాక్టర్ చెల్వరాజు చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో తాజాగా బుధవారం లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఈ ఫిర్యాదులో... తనను పలువురు వ్యక్తులను హనీట్రాప్ చేయమని బలవంతం చేశారని బాధితురాలు పేర్కొందని తెలుస్తోంది. తాను చెప్పినట్లు ఈ పనిచేయకపోతే చంపేస్తానని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం!

Tags:    

Similar News