పోర్న్ వాచ్ పై సంచలన నివేదిక.. తెరపైకి దిగ్భ్రాంతికర విషయాలు!
ఆ వెబ్ సైట్లను కట్టడి చేయలేని ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది.
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. అంతకంటే ముందు స్మార్ట్ ఫోన్ చేతిలో పడ్డాక.. అశ్లీలత ఎక్కువగా పెరిగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లితండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటారు! ఆ వెబ్ సైట్లను కట్టడి చేయలేని ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది.
ప్రధానంగా చేతిలో స్మార్ట్ ఫోన్, దానికి దాదాపు 4జీ/5జీ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండటంతో అశ్లీతల విపరీతంగా పెరిగిపోతుందని.. ప్రధానంగా యువత లక్ష్యంగా ఈ మహమ్మారి జడలు విచ్చుతుందని అంటున్నారు. ఫలితంగా.. కొంతమంది యువత పోర్న్ వీడియోలు చూసి మృగాల్లా మారిపోయి ఆడవాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారని అంటున్నారు.
సెక్స్ ఎడ్యుకేషన్ కీ విచ్చలవిడి చేష్టలను చూపించే పోర్న్ వీడియోలకు తేడా తెలియకో.. మంచి కంటే చెడు ఆకర్షణీయంగా ఉండటం వల్లో కానీ చాలా మంది యువత ఇవి చూసి, మృగాలుగా మారిపోతున్నారని చెబుతూ మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడిస్తూ ఓ రిపోర్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది!
అవును... రోజు రోజుకీ పెరిగిపోతున్న అశ్లీలత, పోర్న్ వాచ్ వల్ల సమాజంలో పెను సమస్యగా మారుతున్న విషయాలకు సంబంధించి ఆస్ట్రేలియాలో ఓ షాకింగ్ రిపోర్ట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ రిపోర్ట్ లో ప్రతీ ముగ్గురు పిల్లల్లో ఒకరు సెక్స్ గురించి తెలుసుకుంటున్నారని పేర్కొంది.
ఇదే సమయంలో 16-20 సంవత్సరాల వయసు గల ఆస్ట్రేలియన్లు అశ్లీలతపై మక్కువ చూపిస్తున్నట్లుగా తేలింది. ప్రధానంగా... పోర్న్ వీడియోల్లో హింసాత్మకంగా ఉన్న వీడియోలను యువత ఎక్కువగా చూస్తున్నారని.. ఫలితంగా సెక్స్ సమయంలో భాగస్వామిపట్ల ఆ ప్రభావాన్ని చూపిస్తున్నారని ఆందోళనకర విషయాలు వెల్లడించింది.
సుమారు 832 మంది పాల్గొన్న ఆన్ లైన్ సర్వేలో సెక్స్, డేటింగ్ సంబంధాలపై యువత మొగ్గు చూపుతున్నట్లు తేలిందని.. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ గా భావిస్తున్నట్లుగా స్పష్టమైందని అంటున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మెల్ బోర్న్ లా స్కూల్, క్వీన్ ల్యాండ్ యూనివర్సిటీ చేసిన సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా... 18 - 35 సంవత్సరాల వయస్సు గలవారు 57 శాతం మంది సెక్స్ సమయంలో ఒక్కసారైనా ఉక్కిరిబిక్కిరి లేదా గొంగు కోసి చంపబడ్డారనే షాకింగ్ విషయం తేలిందని అంటున్నారు. ఈ సందర్భంగా.. ఏకాభిప్రాయంతో కూడిన సెక్స్ నుంచి హింసాత్మక సెక్స్ ను ఈ సమాజం డిఫాల్ట్ గా మార్చిందని అంటున్నారు.
ఇదే సమయంలో... పోర్న్ వీడియోలు చూడటం వల్ల పిల్లల భవిష్యత్తు పాడవుతుందని, మహిళల పట్ల చిన్నచూపు కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.