నాగార్జున తగ్గేదేలే... కొండా సురేఖ కేసులో కీలక మలుపు!

దీంతో... ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు.

Update: 2024-10-11 04:26 GMT

అక్కినేని నాగార్జున, నాగచైతన్య, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీ జనాలు, రాజకీయ నాయకులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇక ప్రకాశ్ రాజ్ అయితే... "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా..?" అంటూ ఘాటుగా నిలదీశారు! ఈ క్రమంలో నాగార్జున ట్వీట్ చేస్తూ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. దీంతో... ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు. అయినా కూడా తగ్గేదేలే అన్నట్లుగా నాగార్జున ముందుకు వెళ్లారు.

ఇందులో భాగంగా... మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీంతో... ఈ కేసును విచారణకు స్వీకరించిన నాంపలి ప్రత్యేక న్యాయస్థానం... నాగార్జున స్టేట్ మెంట్ ను ఇప్పటికే రికార్డు చేసింది. మరో సక్షి ఇచ్చిన స్టేట్ మెంట్ ను కూడా ఈ గురువారం రికార్డ్ చేసింది. ఈ సమయంలో కీలక మలుపు నెలకొంది.

అవును... కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలో నాగార్జునతో పాటు, మరో సాక్షి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది న్యాయస్థానం. అనంతరం... మంత్రి కోండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. దీంతో.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొన్నట్లయ్యిందని అంటున్నారు!

ఇదే సమయంలో... అక్కినేని నాగార్జున ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందిగా మంత్రిని నాంపల్లి స్పెషల్ కోర్టు ఆదేశించింది! ఇక ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.

మరోవైపు... ఉద్దేశ్యపూర్వకంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తన ఇమేజ్ కు డ్యామేజీ కలిగించేలా వ్యాఖ్యానించారంటూ మంత్రి కొండా సురేఖపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నాంపల్లి పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరుపున ఆయన లాయర్ ఉమామహేశ్వరరావు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో... ఈ కేసులో వరుస కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లయ్యింది!

Tags:    

Similar News