నాటి జిహాదీ నేటి దేశాధ్యక్షుడు.. అదెలా సాధ్యమైందంటే?

ఉగ్రవాదిగా మొదలై ఏకంగా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-12-09 06:02 GMT

అతడో ఉగ్రవాది. తాను అనుకున్నది సాధించేందుకు జిహాదీగా మారాడు. అతడి అరాచకాలకు చెక్ చెప్పేందుకు అగ్రరాజ్యం అమెరికా అతడి తలకు కోటి డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది. కట్ చేస్తే.. ఇప్పుడు అతడో దేశానికి అధ్యక్షుడయ్యాడు. దీంతో.. ప్రపంచ దేశాలు అతడి వైపు చూడటం మొదలైంది. ఉగ్రవాదిగా మొదలై ఏకంగా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన అతడి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు అతడెవరు? ఏ దేశానికి అధ్యక్షుడు అయ్యాడు? అన్న వివరాల్లోకి వెళితే..

అతడి పేరు అబూ మొహమ్మద్ అల్ గోలానీ. ఇప్పుడు సిరియా దేశాధ్యక్షుడిగా అవతరించాడు. ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బషర్ అస్సాద్ ను తన అద్భుత తిరుగుబాటుతో పడగొట్టాడు. దేశాధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నాడు. యాభై ఏళ్లుగా సిరియాను ఏలుతున్న అస్సాద్ కుటుంబ పాలనకు చరమగీతం పాడి.. అతడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లేలా చేసిన గోలానీ.. ఇప్పుడు సిరియాను ఏ రీతిలో ఏలుతాడు అన్నదిప్పుడు ప్రశ్న.

42 ఏళ్ల గోలానీ.. సిరియాలో గడిచిన పద్నాలుగేళ్లుగా సాగుతున్న అంతర్యుద్దాన్ని తట్టుకొని పాలిస్తున్న అసద్ ను చావుదెబ్బ తీయటం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు.. అధ్యక్ష పదవిపై గురి పెట్టిన 11 రోజుల్లోనే దేశం మీద పట్టుసాధించిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే.. తన 22 ఏళ్ల వయసులో మొదటిసారి అల్ ఖైదాతో చేతులు కలిపిన గోలానీ..ఇరాక్ లో అమెరికా సేనలకు వ్యతిరేకంగా పోరాడాడు.

అంతేకాదు.. ఆ సమయంలో అమెరికా సేనలకు చిక్కి ఐదేళ్లు జైల్లో గడిపాడు. ఆ సమయంలోనే భావసార్యుపత ఉన్న ముఠాలను ఒక తాటి మీదకు తీసుకొచ్చాడు. ఆ సమయంలోనే ఇతడిపై అమెరికా ఉగ్రవాదిగా ముద్ర వేయటమే కాదు.. అతడ్ని పట్టిస్తే కోటి డాలర్లు బహుమానంగా ఇస్తామంటూ అతడి తలకు వెల కట్టింది. 2013లో సిరియాలో అంతర్యుద్దం మొదలైన తర్వాత నుస్రా ఫ్రంట్ ను ఇరాక్ అల్ ఖైదాలో కలిపేసి కొత్తగా స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ను స్థాపించాలని అబూబకర్ చెప్పారు. అయితే.. ఐసిస్ ఏర్పాటు నచ్చక సొంతంగా నుస్రా ఫ్రంట్ ను కంటిన్యూ చేశాడు. అంతేకాదు 2016లో అల్ ఖైదాతో తెగతెంపులు చేసుకున్నాడు.

తన సొంత కుంపటి జభాత్ ఫతే అల్ షామ్ ను స్థాపించాడు. దీన్ని ఏర్పాటు చేసిన ఏడాది తర్వాత దాని పేరును హయత్ తహ్రీర్ అల్ షామ్ గా మార్చారు. ఇడ్లిబ్ ప్రావిన్స్ లో తన పట్టును నిలుపుకున్న అతడు.. స్వతంత్రంగా పోరాటం చేసే వేర్వేరు ఇస్లామిక సంస్థల్ని తమలో కలుపుకొని మరింత బలోపేతమయ్యాడు. తుర్కియే అండతో చెలరేగిపోయిన వేర్పాటువాదుల దాడులలో చనిపోయిన కుర్దుల కుటుంబాలను కలిసి మంచివాడిగా పేరు ప్రతిష్ఠలను పెంచుకున్నాడు.

2016లో తొలిసారి బహిరంగ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకోవటంతో పాటు.. మూడేళ్ల క్రితం ఒక అమెరికన్ జర్నలిస్టులకు మొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తమ సంస్థ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పని చేయదని స్పష్టం చేశాడు. సిరియాపై ఆంక్షలు విధించొద్దని చెబుతూ.. అమెరికా విధించిన ఆంక్షల్ని తీవ్రంగా తప్పు పట్టారు.తాను అమెరికా.. యూరోప్ దేశాలతో యుద్ధాలకు దిగాలని అనుకోవట్లేదంటూ పేర్కొనటం ద్వారా.. వారితో వైరం పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశాడు.

Tags:    

Similar News